Sunny Leone : సన్నీలియోన్.! ఇక్కడ ముంచేసింది. అక్కడ ఏం చేస్తుందో తెలుసా.?
NQ Staff - November 2, 2022 / 09:15 PM IST

Sunny Leone : బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఇటీవలే తెలుగులో ‘జిన్నా’ సినిమాలో నటించింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
సినిమా రిలీజ్‌కి ముందు ప్రమోషన్లతో ఊదరగొట్టేశారు. కానీ, అంత సీను లేదని తేల్చేశారు ‘జిన్నా’ సినిమాకి. సన్నీలియోన్ వైపు నుంచే సినిమాని తెగ ప్రమోట్ చేశారు కానీ, అస్సలు వర్కవుట్ కాలేదు.
సన్నీ ఇక్కడా అక్కడా సేమ్ టు సేమ్.! కానీ.!
ఇక ఇప్పుడు సన్నీలియోన్ తమిళంలో ఓ సినిమా చేస్తోంది. ‘ఓ మై ఘోస్ట్’ పేరుతో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. హారర్ కామెడీగా రూపొందుతోన్న ఈ సినిమాలో మహారాణి పాత్రలో కనిపిస్తోంది సన్నీలియోన్.
మహారాణి గెటప్‌లోనే యాక్షన్ స్టంట్లు కూడా చేసేస్తోంది. యోగిబాబు తదితరులు నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. కానీ, రిలీజ్ తర్వాత రిజల్ట్ ఎలా వుండబోతోందో ఇప్పుడప్పుడే చెప్పలేం.
థ్రిల్లర్ అండ్ హారర్ మూవీస్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన సన్నీలియోన్, అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ ఒకేసారి అదే తరహా కాన్సెప్టుల్లో నటించింది. తెలుగు మేకర్లను ముంచేసింది.మరి, తమిళ తంబీల్ని ఏం చేస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.!