Adipurush Event : ఆదిపురుష్ నుంచి మరో ట్రైలర్.. ఈ సారి యుద్ధ రణరంగమే..!
NQ Staff - June 6, 2023 / 09:20 AM IST

Adipurush Event : డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వస్తోంది. పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలతో వస్తున్న ఆదిపురుష్ మూవీ జూన్ 16న రిలీజ్ కు రెడీ కాబోతోంది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలను పెంచేసింది.
కానీ రాముడు, రావణుడి మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలను మాత్రం చూపించలేదు. అయితే వాటిని కావాలనే దాచిపెట్టినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో ట్రైలర్ రాబోతోంది. ఈ ట్రైలర్ గత ట్రైలర్ కంటే భారీ ఎత్తున ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో రాముడు, రావణుడి మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలను చూపించబోతున్నారంట.
జూన్ 6న తిరుపతిలో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో ట్రైలర్-2ను రిలీజ్ చేస్తున్నారంట. ఈ ట్రైలర్ అంచనాలను పీక్స్ కు తీసుకెళ్తుందని అంటున్నారు నెటిజన్లు. చూడాలి మరి ఈ ట్రైలర్ ప్రభాస్ ను ఏ రేంజ్ లో చూపిస్తుందో. ఈ ట్రైలర్ ను రాజమౌళి రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నాడు. ఆ తర్వాత ముంబై, చెన్నైలలో కూడా ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఈ సినిమా కచ్చితంగా రూ.2 వేల కోట్లను వసూలు చేస్తుందని అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు కూడా షురూ అయ్యాయి.