Tourism: ఐదు వేల రూపాయల ఖర్చుతోనే మనం చూడగలిగే 6 టూరిస్టు ప్రదేశాలు ఏంటో తెలుసా..!!

Tourism(టూరిస్టు): దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎంతో ఫాస్ట్ గ్రోయింగ్ బిజినెస్ గా ఎదిగింది టూరిజం.. ఒక్కో దేశంలో కొన్ని కొన్ని టూరిజం ప్లేస్ లు ఉంటాయి.. వాటిని చూడడానికి వివిధ రకాల దేశాల నుంచి టూరిస్టులు తరలి వస్తుంటారు.. అయితే అన్ని ప్లేసులు అందరమూ చూడలేము ఎందుకంటే కొన్ని కొన్ని పేజీలు చూడాలంటే చాలా ఖర్చు పెట్టాలి .. మన ఇండియాలో కూడా కొన్ని ప్లేస్ లు చూడాలంటే చాలా ఖర్చు పెట్టాలి.. అలాంటి ఖర్చు లేకుండా కేవలం ఐదు వేల రూపాయలతో మాత్రమే మనం ఇండియాలోని కొన్ని ప్లేస్ లను ఎంచక్కా వీక్షించవచ్చు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

tourisam places in India with very low cost : టూరిస్టు
tourism places in India with very low cost

తక్కువ ఖర్చుతో మన దేశంలో చూడగలిగే టూరిజం స్థలాలలో ఒకటి రాజస్థాన్లోని జైపూర్.. రాజపుత్రుల చరిత్ర, రాజుల కాలం నాటి కట్టడాలు , జైపూర్ వంటకాలు ఇక్కడ చాలా ఫేమస్.. అక్టోబర్ నుంచి మార్చి నెల వరకు ఈ పింక్ సిటీ యొక్క అందాలను చూడడానికి అనువైన సమయం.. ఇక హిమాచల్ ప్రదేశ్ లోని కసోలి కూడా ఎంతో అందమైన ప్రదేశం.. సిమ్లాకు దగ్గర కొండల అందాలు చూడటానికి ఈ ప్రాంతం అనువైనది..జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఇక్కడ టూరిస్టులు అందాలను చూడడానికి అనువైన సమయం..

ఉత్తరాఖండ్ ముస్సూరీ లోని ఆంగ్లేయుల నాటి పురాతన కట్టడాలు, ప్రకృతి రమణీయత ఎంతో అద్భుతంగా ఉంటాయి .. మార్చి నుంచి జూన్ వరకు ఇక్కడ విసిటింగ్ ఎంతో అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు.. తమిళనాడులోని కన్యాకుమారి దేశంలో చూడదగ్గ మరో టూరిజం ప్లేస్. హిందూ మహాసముద్రం ని దగ్గరగా చూడాలంటే కన్యాకుమారి వెళ్లాల్సిందే.. పురాతన నగరమైన వారణాసి అతి తక్కువ ఖర్చుతో చూడదగ్గ గొప్ప పుణ్యస్థలం..ఇక్కడి గంగానది అందాలు, వెల్లువెత్తే ఆధ్యాత్మికత, అన్నం పెట్టే ధర్మశాలలు, అక్కడికి వచ్చే యాత్రికులు ఇవన్నీ మిస్ కావద్దు అంటే కాశీకి వెళ్లి తీరాల్సిందే..

Advertisement