డ్రగ్స్ కేసులో తెలుగు టాప్ హీరోయిన్

బాలీవుడ్ లో ప్రస్తుతం డ్రగ్స్ చర్చ జోరుగా నడుస్తుంది. అయితే సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య వెనుక రియా డ్రగ్స్ ఇచ్చింది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక రియా ను అధికారులు విచారణ కూడా జరిపారు. ఇక ఈ విచారణలో డ్రగ్స్ సంబంధం ఉన్నట్లు తేలింది. దీనితో ఆమెను అరెస్ట్ చేసి డ్రగ్స్ తో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయన్న కోణంలో అధికారులు విచారిస్తున్నారు. ఇక ఈ విచారణలో లో రియా చక్రవర్తి సంచలన విషయాలు బయట పెట్టింది. అయితే డ్రగ్స్ తీసుకున్న వారిలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా పెద్ద ఎత్తున విన్పిస్తుంది.

అంతే కాకుండా సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్, రణవీర్ సింగ్ స్నేహితురాలి పేర్లను బయటపెట్టినట్లు తెలుస్తుంది. ఇక వీరి పేర్లను ఎన్సీబీ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అదికారులకు రియా చక్రవర్తి తెలిపింది. ఇక ఈ కేసులో అధికారులు రియాతో పాటు ఆమె తమ్ముడు శౌమిక్ చక్రవర్తిని, అలాగే సుశాంత్ ఇంట్లో పనిచేసే వాళ్లను కూడా అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.