రేపటి నుండే విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు. కొత్త కార్యాచరణ ఇదే..

Advertisement

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో అన్ని సంస్థలు కూడా మూత పడ్డాయి. ఇక అలా మూతపడిన సంస్థలు అన్ని కూడా అన్ లాక్ ప్రక్రియలో భాగంగా అన్ని తెరుచుకున్నాయి. కానీ విద్య సంస్థలు మాత్రం తెరుచుకోలేదు. దీనితో విద్య సంస్థలు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఇక మొత్తానికి విద్య సంస్థలు తెరిచి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దీనితో సెప్టెంబర్ 1 నుండి విద్య సంస్థలు తెరుచుకొని విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించనుంది. దీనికోసం ఓ ప్రత్యేక కార్యాచరణ కూడా ఏర్పాటు చేసింది. అయితే రేపటి నుంచి 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు, అలాగే ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులకు దూరదర్శన్, టీ-శాట్ ఛానళ్ల ద్వారా డిజిటల్ క్లాసులను నిర్వహించనున్నారు.

ఇక ఉదయం 8 నుండి 10.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తామంటూ సెప్టెంబర్ 14వ తేదీ వరకు డిజిటల్ తరగతుల షెడ్యూల్ ఇంటర్ బోర్డు ప్రకటించింది. అయితే 3వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు క్లాసులు జరగనున్నాయి. అలాగే ప్రతి క్లాస్ సమయం 30 నిమిషాలు అంత కన్నా తక్కువే ఉండేలా ఏర్పాట్లు చేసారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here