పెళ్లికి సిద్ధమైన మరో మెగా హీరో

Admin - August 23, 2020 / 05:28 AM IST

పెళ్లికి సిద్ధమైన మరో మెగా హీరో

ఇండస్ట్రీలో ఉన్న బ్యాచ్ లర్ హీరోలందరు పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న సింగిల్ ఆర్మీ నుండి మెల్లగా ఒక్కొక్క హీరో ఏక్సిట్ అవుతున్నారు. ఈ లాక్ డౌన్ లోనే హీరో నిఖిల్ పెళ్లి చేసుకున్నారు. అలాగే భీష్మ ‘ఫర్ ఎవర్ సింగల్’ అనే మూవీతో అలరించిన నితిన్ కూడా పెళ్లి చేసుకుని సింగల్ ఆర్మీ గ్రూప్ నుండి ఏక్సిట్ అయ్యాడు. తరువాత “షి సెడ్ ఓకే’ అనే పోస్ట్ రానా దగ్గుబాటి కూడా పెళ్లి చేసుకున్నారు.

ఇప్పుడు ఇండస్ట్రీలో బ్యాచ్ లర్ గా మరో మెగా హీరో కూడా పెళ్లికి సిద్ధమయ్యాడు. ఆ హీరో ఎవరంటే సాయి ధరమ్ తేజ్. సోలో బతుకే సో బెటర్ అనే మూవీ చేస్తున్న సాయి ధరమ్ కూడా ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. ‘ఒక్కోసారి మనం ఎన్నో అనుకుంటాం కానీ టైం వచ్చినప్పుడు’ అనే పోస్ట్ తో తన పెళ్లికి సిద్ధమవుతున్నానని హింట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ రేపు ఉదయం 10 గంటలకు చెప్తానని సాయి ధరమ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us