Tollywood: టెస్లా కార్ల‌కి స్వాగ‌తం ప‌లుకుతున్న టాలీవుడ్.. కేటీఆర్ ట్వీట్‌ని ట్యాగ్ చేస్తూ..

Tollywood:భారత్‌లో పెట్టుబడులు పెట్టే విషయంలో కార్పొరేట్ బిగ్ షాట్..అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటోన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటే చాలా ఆ దేశ ప్రభుత్వంతో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోందంటూ బాంబు పేల్చారు. వాటిని పరిష్కరించుకోవడానికి రెండు సంవత్సరాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

మార్కెట్‌ పరంగా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద విపణి కలిగిన భారత్‌లో తమ కార్లను ప్రవేశపెట్టేందుకు టెస్లా అధినేత కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. మూడేళ్ల నుంచి ఈ విషయంపై భారత ప్రభుత్వం, మస్క్‌ మధ్య చర్చలు జరుగుతున్నా ఓ కొలిక్కి రావడం లేదు. ఇందుకు ఎలన్ విధించిన షరతులే కారణమని తెలుస్తోంది.

భారత మార్కెట్లో టెస్లా కార్ల విడుదలపై ఓ నెటిజన్‌ ‘ టెస్లా కార్లు బాగుంటాయి.. ఇండియాలో వీటి విడుదలపై ఏమైనా అప్డేట్ ఉందా?’ అని మస్క్ ను ట్యాగ్ చేస్తూ ఆసక్తికర ప్రశ్న సంధించాడు ఓ నెటిజన్‌. దీనిపై స్పందించిన మస్క్‌ ‘ భారత ప్రభుత్వంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఇప్పటికీ దీనిపై ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం’ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ఇది కాస్తా వివాదానికి దారి తీసింది.

tollywood welcomes to tesla1
tollywood welcomes to tesla1

భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలన్‌ చేసిన వ్యాఖ్యలపై చాలామంది మండిపడుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ టెస్లా అధినేత వ్యాఖ్యలపై స్పందించారు. ముందుగా భారత్ లో తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభిస్తున్నందుకు మస్క్‌కు ధన్యవాదాలు చెప్పిన ఆయన.. ఆ తర్వాత తెలంగాణ/ ఇండియాలో పరిశ్రమల అభివృద్ధికి బోలెడు అవకాశాలున్నాయన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, సుస్థిరత విషయాల్లో తెలంగాణ ఛాంపియన్‌గా నిలిచిందన్నారు.

కేటీఆర్ చేసిన ట్వీట్‌ని షేర్ చేస్తూ.. జెనీలియా, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మెహ‌ర్ ర‌మేష్ వంటి ప్ర‌ముఖులు టెస్లా కారుని స్వాగ‌తిస్తున్నారు. కారు చాలా బాగుంటుంద‌ని వారు తెలియ‌జేస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం కొర్రీలు పెడుతుండటం, తెలంగాణ మంత్రి మాత్రం ఎలన్​ మస్క్​కు ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు ట్వీట్​ చేయడంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

గతంలో టెస్లా కారుని స్వయంగా నడిపి చూశారు కేటీఆర్‌. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్న టెస్లా మోడల్‌ ఎక్స్‌ కారుని అమెరికాలో నడిపారు. కారు బాగుందని తెలుపుతూ కొత్తగా ఆలోచించిన ఎలన్‌మస్క్‌కి ట్విట్టర్​ వేదికగా అభినందనలు తెలిపారు. కాగా తాజాగా పాత ట్వీట్‌ని రీట్వీట్‌ చేశారు కేటీఆర్‌.