విడాకులు తీసుకున్న టాలీవుడ్ సింగర్

Advertisement

టాలీవుడ్ ప్రముఖ సింగర్, నటుడు నోయల్ తాను విడాకులు తీసుకున్నట్లు షాకింగ్ న్యూస్ చెప్పాడు. అయితే గత సంవత్సరం నోయల్, నటి ఎస్తర్ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వాళ్ళ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాల కారణంగానే విడాకులు తీసుకొని విడిపోతున్నామని, అలాగే తమ మధ్య ఉన్న మంచి బంధాన్ని, దాని విలువలను కాపాడుకునేందుకు ఇది సరైన నిర్ణయమని భావిస్తున్నట్లు అనుకుంటున్నా అని పేర్కొన్నాడు.

ఇప్పటికే విడాకుల‌ కోసం కోర్టులో దరఖాస్తు చేశామని, కానీ ఇన్ని రోజులు కోర్టు తీర్పు కోసం వేచి చూసినట్లు వెల్లడించాడు. అలాగే ఎస్తర్‌ జీవితం సంతోషంగా ఉండాలని, ఆమెకు అంతా మంచి జరిగి, తను కన్నా కళలు సాకారం కావాలని ఆకాంక్షించాడు. ఇక ఈ విడాకుల గురించి తన కుటుంబాన్ని గానీ, ఎస్తర్ ‌ను గానీ ఇబ్బంది పెట్టొద్దని సూచించాడు. ఇక ఇప్పటి నుండి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు నోయల్.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here