Shruti Haasan : నా ఫ్యామిలీ నాకు ఎప్పుడూ సపోర్ట్ ఇవ్వలేదు.. శృతి హాసన్ షాకింగ్ వ్యాఖ్యలు?

Shruti Haasan : శృతి హాసన్ తెలుసు కదా. టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా రాణించింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో కనిపిస్తోంది. కానీ.. టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకొని.. టాప్ హీరోలు అందరితో ఆడిపాడింది శృతి. నిజానికి శృతి హాసన్ ది సినిమా ఫ్యామిలీయే అని అందరికీ తెలుసు. తన తండ్రి కమల్ హాసన్ పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ.. తను ఏమాత్రం తన సపోర్ట్ తీసుకోకుండా సొంతంగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. అదే గ్రేట్ నెస్ అంటే. శృతి హాసన్ చాలా స్ట్రయిట్ ఫార్వార్డ్. తన ఫ్యామిలీ గురించి ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటుంది. తన తల్లిదండ్రులు విడిపోయినప్పుడు కూడా పెద్దగా బాధపడలేదని… ఆమధ్య కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

v
tollywood shruti haasan about her family

తాజాగా శృతి హాసన్ మళ్లీ తన ఫ్యామిలీ గురించే కొన్ని కామెంట్లు చేసింది. నా ఫ్యామిలీ నన్ను ఏనాడూ పట్టించుకోలేదు. ఏనాడూ మద్దతు ఇవ్వలేదు. అసలు.. నేను ఆ ఫ్యామిలీలో భాగం అని కూడా ఎన్నడూ అనుకూలేదు. నాకు రక్షణగా నిలబడలేదు. చిన్నప్పటి నుంచి అంతే.. నేను చిన్నప్పటి నుంచి స్వతంత్రంగానే పెరిగా. నాదగ్గర దాచుకోవడానికి ఏం లేదు. నేను లోపల ఒకటి.. బయటికి ఇంకొకటి మాట్లాడను. అందుకే చిన్నప్పటి నుంచి నాకు నేను రక్షణగా ఉండటం అలవాటు చేసుకున్నా.. అంటూ చెప్పుకొచ్చింది శృతి.

పైగా.. చిన్నతనం నుంచి అలా స్వతంత్రంగా పెరగడమే.. తనకు బాగా ఉపయోగపడిందని చెబుతోంది ఈ భామ. నిజానికి.. చాలామంది హీరోయిన్లు అసలు తమ వ్యక్తిగత విషయాలనే షేర్ చేసుకోరు. కానీ.. శృతి మాత్రం వాళ్లకు భిన్నంగా తన వ్యక్తిగత విషయాలను ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. ఇక.. తన సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల శృతి హాసన్.. క్రాక్ సినిమాలో మెరిసింది. మళ్లీ తనకు ఇఫ్పుడిప్పుడే అవకాశాలు అంది వస్తున్నాయి. వకీల్ సాబ్ సినిమాలోనూ మంచి క్యారెక్టర్ చేసింది శృతి.