టాలీవుడ్ లో మరో విషాదం రోడ్డు ప్రమాదంలో నిర్మాత మృతి

Advertisement

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. కెఎఫ్‌సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్స్‌లో ఒకరైన నిర్మాత కమలాకర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో కన్ను మూశారు. అయితే ఇటీవలే కమలాకర్ రెడ్డి తండ్రి నందగోపాల్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఆయన తండ్రి వయసు 75 ఏళ్లు. దాంతో ఆయనతో కాంటాక్ట్‌లో ఉన్న కమలాకర్ రెడ్డికి కూడా కరోనా వచ్చింది. అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఆసుపత్రికి వస్తుండగా నల్లగొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీ కొట్టింది.

ఇక ఈ ప్రమాదంలో తండ్రి కొడుకులు ఇద్దరు మృతి చెందడం తో కుటుంబంలో విషాదం నెలకొంది. కమలాకర్‌రెడ్డి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. అయితే ఇటీవల విడుదలైన ‘కనులు కనులు దోచాయంటే’ సినిమాను కేఎఫ్‌సి ఎంటర్‌టైన్మెంట్ సంస్థ తెలుగులో విడుదల చేసింది. ఈ సినిమాకు కమలాకర్‌రెడ్డి కో ప్రోడ్యూసర్‌గా చేసాడు. అలాగే తెలుగులో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు ‘అర్జున్‌రెడ్డి’ మరియు ‘ఎజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలకు కమలాకర్ రెడ్డి డిస్ట్రీబూటర్‌గా పనిచేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here