భారత్ లో టాలీవుడ్ దే అగ్రస్థానం : కంగనా

Advertisement

బాలీవుడ్ లో డ్రగ్స్ చర్చ జోరుగా జరుగుతుంది. ఇక ఇప్పటికే ఈ డ్రగ్స్ వ్యవహారంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అనేక విషయాలు బయటపెట్టింది. ఇది ఇలా ఉంటె తాజాగా కంగనా మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అయితే దేశంలో బాలీవుడ్ అగ్ర స్తానం అని చెప్పుకోవడానికి మాత్రమే అని ఆమె పెర్కొంది. అయితే ఆ విషయం తప్పు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ అగ్రస్థానంలోకి వచ్చింది.

టాలీవుడ్ లో పాన్-ఇండియా సినిమాలను ఎక్కువగా నిర్మిస్తున్నారు. అలాగే ఎన్నో హిందీ సినిమాలు హైదరాబాద్ ‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీ లోనే షూటింగ్‌లు నిర్వహిస్తారు. సినీ పరిశ్రమలో చాలా మార్పులు రావాలని, అన్ని చిత్ర పరిశ్రమలు కలిసి ఓకే భారతీయ చలనచిత్ర పరిశ్రమగా ఏర్పడాలని ఆమె తెలిపింది. ఇక భారత్ సినీ పరిశ్రమలు ఇలా విడిపోవడం వలనే హాలీవుడ్ లాభపడుతోందని కంగన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here