టాలీవుడ్ లో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు ఎవరో తెలుసా..!

Advertisement

ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో హీరోలు ఒక్క సినిమాకు కాసులు భారీగా దండుకుంటున్నారు. ఒక్క సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే నోరోళ్లేపెడ్తారు. ఇక ఎవరు ఎంత తీసుకుంటున్నారో ఓసారి చూద్దాం.

బాహుబలి లాంటి అద్భుతమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకత ను చాటుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తెలుగులో మొట్ట మొదటి పాన్ ఇండియా గా చేసిన బాహుబలి సినిమాకు ప్రభాస్ 75 కోట్లు తీసుకున్నాడు. అంతేకాదు ఈ సినిమా తరువాత వచ్చిన saaho సినిమాకు 70 కోట్లు తీసుకున్నాడు ప్రభాస్.

చాలా రోజుల విశ్రాంతి తర్వాత మన ముందుకు రాబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తాజాగా తాను నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాకు ఒక్క రోజుకు 1.5 కోట్లు తీసుకుంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొత్తం పదిహేను రోజుల నుండి పదిహేడు రోజుల వరకు పూర్తి కానుంది. మొత్తానికి పవర్ స్టార్ ఒక్క సినిమాకు 55 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

సూపర్ స్థార్ మహేష్ బాబు ఈ సంవత్సర మొదట్లోనే సరిలేరు నీకెవ్వరూ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాకు ముందు 25 కోట్లు తీసుకున్నాడు. ఈ సినిమా అనంతరం 40 నుండి 50 కోట్లు తీసుకోవాలని నిర్ణయించున్నారు. అదే తరహాలో మెగా స్టార్ చిరంజీవి కూడా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. తాను నటించిన సైరా నరసింహ రెడ్డి సినిమా తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాడు.

త్రిబుల్ ఆర్ సినిమా తో మన ముందుకు రాబోతున్న హీరోలు రాంచరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్. ఈ ఇద్దరు కూడా విలక్షణ నటనతో తమదైన శైలిలో ఆకట్టుకుంటారు. ఇప్పుడు వీళ్లిద్దరు కూడా ఒక్క సినిమాకు 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

అలవైకుంఠపురం లో సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా తన ఖాతాలో వేసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ సంత్సరంలో తన సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ఒక్క సినిమాకు 25 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు.

అర్జున్ రెడ్డి సినిమాతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తరువాత తన ఫాన్స్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ప్రస్తుతం విజయ్ ఒక్క సినిమాకు 10 కోట్లు తీసుకుంటున్నారు. అదేతరహాలో నాని కూడా ఒక్క సినిమాకు 10 కోట్లు తీసుకుంటున్నాడు. ఇక రవితేజ, నాగార్జున, వెంకటేష్ మరియు బాలకృష్ణ కూడా ఒక సినిమాకు 10 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు.

మజిలీ సినిమా తో ఫాన్స్ ఫాలోయింగ్ పెంచున్నాడు అక్కినేని నాగచైతన్య. ప్రస్తుతం తాను ఒక్క సినిమాకు 8 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here