కాజల్ కు సీక్రెట్ గా ఎంగేజిమెంట్. అబ్బాయి ఎవరో తెలుసా..

Advertisement

అందాల భామ, నటి కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. అయితే ఇప్పటికే తన చెల్లెలు నిషా అగర్వాల్ కు పెళ్లి అయి ఒక బాబు కూడా ఉన్నాడు. ఇక మొత్తానికి కాజల్ కూడా పెళ్లికి సిద్ధం అయింది. అయితే ఔరంగాబాద్ కు చెందిన గౌతమ్ అనే ఒక బిజినెస్ మేన్ తో కాజల్ అగర్వాల్ ఎంగేజిమెంట్ జరిగిపోయింది. అయితే ఈ ఎంగేజిమెంట్ గుట్టు చప్పుడు లేకుండా జరిగిందని వార్తలు వస్తున్నాయి.

అయితే కాజల్ కు వయస్సు 30 దాటినందు వలనే రహస్యంగా ఈ కార్యం జరిగిందని అంటున్నారు. అయితే ఈ కార్యక్రమానికి హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా హాజరయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇక గతంలో కూడా పలుమార్లు ఈ ముద్దుగుమ్మ పెళ్లి గురించి వార్తలు హల్ చల్ చేసినా అవి నిజం కాదని తేలిపోయింది. కానీ ఈ సారి మాత్రం ఆమె పెళ్లిబాజాలు మోగేందుకు ఇంకా ఎంతో సమయం లేదని తెలుస్తుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here