Tollywood Heroes : తెలుగు హీరోలను నిండా ముంచేస్తున్న తమిళ దర్శకులు.. పరువు తీస్తున్నారుగా..!
NQ Staff - May 16, 2023 / 02:31 PM IST

Tollywood Heroes : తెలుగు హీరోలకు సౌత్ లో మంచి మార్కెట్ ఉంది. తెలుగు, తమిళం కాంబోలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. మన తెలుగు హీరోలు కూడా తమిళ దర్శకులకు చాలాసార్లు అవకాశాలు ఇచ్చారు. కానీ వారు మాత్రం మన తెలుగు హీరోల పరువును తీసేస్తున్నారు. తాజాగా కస్టడీ సినిమాతో అది మరోసారి నిరూపితం అయిందనే చెప్పుకోవాలి.
ఎస్ జే సూర్య, గౌతమ్ మీనన్, ఏఆర్ మురుగదాస్ లాంటి వారికి తమిళంలో మంచి క్రేజ్ ఉంది. అయితే తెలుగులో ఎస్ జే సూర్య తీసిన ఖుషి సినిమా మంచి హిట్ అయినా.. కొమురం పులి మాత్రం పవన్ కు పెద్ద ప్లాప్ ఇచ్చింది. ఇక ఏఆర్ మురుగదాస్ చిరంజీవితో స్టాలిన్, మహేశ్ బాబుతో స్పైడర్ సినిమాలు చేసి భారీ ప్లాపులు ఇచ్చాడు.
లింగుస్వామి కూడా రామ్ పోతినేనితో వారియర్ అనే సినిమా తీస్తే ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. అలాగే నాగచైతన్యకు కృష్ణ మారిమత్తుతో చేసిన సినిమా “యుద్ధం శరణం గచ్చామి” రీసెంట్ గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేసిన బైలింగువల్ సినిమా “కస్టడీ” అట్టర్ ప్లాప్ ను మిగిల్చాయి.

Tollywood Heroes Given Chances Tamil Directors Many Times
అలాగే గతంలో నాని చేసిన సెగ, ఎటోవెళ్లిపోయింది మనసు సినిమాలు కూడా తమిళ్ డైరెక్టర్లు చేసినవే. పవన్ కల్యాణ్ కు గతంలో విష్ణు వర్ధన్ డైరెక్షన్ లో చేసిన “పంజా”, ధరణి దర్శకత్వంలో చేసిన “బంగారం” కూడా హిట్ ను ఇవ్వలేక పోయాయి. వీరే కాదు అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలు కూడా ఇబ్బంది పడ్డారు.