వికలాంగుడి పాత్రలో టాలీవుడ్ యువ హీరో

Advertisement

టాలీవుడ్ లో హీరోలు కొత్త కొత్త గెటప్ లతో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతున్నారు. అయితే ఇప్పటికే హీరో రవితేజ కళ్ళు లేకుండా తెర పై కనిపించాడు. ఇక అదే తరుణంలో యువ హీరో శర్వానంద్ కూడా ఓ కొత్త గెటప్ తో ముందుకు రానున్నాడు. ఇక శర్వానంద్ తాను నటించబోతున్న సినిమాలో వికలాంగుడిగా కనిపించబోతున్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక ఈ సినిమాకు
ఒక నూతన దర్శకుడు ప్రకాష్ తాను చెప్పిన ఒక వికలాంగుడి కథ శర్వానంద్ కు బాగా నచ్చిందని సమాచారం.

ఇక అందుకే ఈ సినిమాలో హీరోగా నటించడానికి శర్వానంద్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం శర్వానంద్ పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ‘శ్రీకారం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అలాగే మరో సినిమా తెలుగు మరియు తమిళ భాషలో ఫేమస్ కొరియోగ్రఫర్ రాజు సుందరం దర్శకత్వంలో నటిస్తున్నాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here