టాలీవుడ్ లో డిజిటల్ రిలీస్ కు సిద్ధమవుతున్న నాలుగు చిత్రాలు ఇవే..

Admin - August 14, 2020 / 10:18 AM IST

టాలీవుడ్ లో డిజిటల్ రిలీస్ కు సిద్ధమవుతున్న నాలుగు చిత్రాలు ఇవే..

కరోనా దృష్ట్యా సినిమా థియేటర్లు అన్ని కూడా మూత పడ్డాయి. దీనితో సినీ ప్రముఖులు సినిమాల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలు అన్ని కూడా ఓటిటి ప్లాట్ఫారం ద్వారా రిలీస్ చేస్తున్నారు. అయితే అదే క్రమంలో టాలీవుడ్ లో టాప్ నటీనటుల సినిమాలు కూడా ఓటిటి ద్వారా రిలీస్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.

అయితే మొదటగా నాచురాలు స్టార్ నాని నటిస్తున్న ‘ V ‘ సినిమా సెప్టెంబర్ 5 న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది అని అధికారిక ప్రకటన కూడా చేసారు. అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కోసం 33 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ సినిమా దారిలోనే మిగితా సినిమాలు కూడా డిజిటల్ విడుదలకు సిద్ధం అవుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా కూడా ఓటిటి ప్లాట్ ఫర్మ్ ద్వారా విడుదల కానుంది. అయితే ఈ సినిమా జీ5 లో రిలీస్ అవ్వనుంది. అయితే దానికోసం 25 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

అలాగే మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న క్రాక్ సినిమా ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా కూడా ఓటిటి ప్లాట్ ఫర్మ్ ద్వారా రిలీస్ కానుంది. ఈ సినిమా ను కూడా జీ5 ద్వారా అక్టోబర్ లో రిలీస్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. అలాగే అనుష్క నటిస్తున్న నిశ్శబ్దం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. అలాగే విఎఫెక్స్స్ పని కూడా పెండింగ్ లో ఉంది. ఇక ఈ సినిమాను కూడా ఓటిటి ఫ్లాట్ ఫర్మ్ ద్వారా రిలీస్ చేయడానికి 24 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక నిశ్శబ్దం సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us