పోడ్ కాస్ట్స్ ను ప్రారంభిస్తున్న తెలుగు సినీ దర్శకులు

Advertisement

తమ అభిప్రాయాలను పంచుకోవడానికి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను వాడుతూ ఉంటారు. సినీ ప్రముఖులైతే తమ అభిప్రాయాలను పంచుకుంటూనే సినీ ప్రమోషన్స్ ను కూడా ఉపయోగించుకుంటారు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, షేర్ చాట్ లాంటి వాటితో పాటు యూట్యూబ్ లో కూడా ప్రతి సినీ ప్రముఖులు తమ సొంత చానెల్స్ ను ప్రారంభిస్తున్నారు. వాటిలో తమ సినిమాలకు సంబంధించిన టీజర్, ట్రైలర్స్ ను షేర్ చేస్తూ ఉంటారు.

అయితే తాజాగా పోడ్ కాస్ట్ లు చేయడం కూడా ప్రారంభించారు. పోడ్ కాస్ట్స్ అంటే ఆడియో ఫార్మాట్ డిస్కషన్ లాంటిది. ఈ మధ్య ఇండియాలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే ఇప్పుడు తెలుగు సినీ దర్శకులైన పూరి జగన్నాథ్, హరీష్ శంకర్ లు తమ సొంత పోడ్ కాస్ట్ లు ప్రారంభించారు. పూరి తన పోడ్ కాస్ట్ కు పూరి మ్యూజింగ్ అని, హరీష్ శంకర్ తన పోడ్ కాస్ట్ కు సౌండ్స్ గుడ్ అనే పేర్లు పెట్టుకున్నారు. వీటితో ఇంటర్వ్యూ లలో చెప్పలేని ఎన్నో విషయాలను, తమ అనుభవాలను పంచుకొనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here