Tollywood: త‌ప్పుడు ప‌నికి, అర్హ‌త కోల్పోనున్న న‌టి

Tollywood: నవనీత్ కౌర్.. ఈ పేరు గురించి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు తెలుగులో చాలా సినిమాలు చేసింది ఈమె. దాదాపు డజన్ సినిమాలకు పైగానే నటించిన ఈ పంజాబీ అమ్మాయి.. ఆ తర్వాత పెద్దింటికి కోడలుగా వెళ్లింది. ఇప్పుడు అమరావతి ఎంపీ కూడా. రాజకీయాల్లోనూ మంచి ఇమేజ్ సంపాదించుకుంది నవనీత్ కౌర్.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమెపై ఓ కేసు ఫైల్ అయింది. నకిలీ క్యాస్ట్‌ సర్టిఫికేట్‌పై పోటీ చేసి గెలిచినట్లు ఈమెపై ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆమె క్యాస్ట్ సర్టిఫికేట్‌ రద్దుతో పాటు జరిమానా విధించింది బాంబే హైకోర్టు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచింది సినీనటి నవనీత్‌ కౌర్‌. ఈమె భర్త రాణా కూడా రాజకీయ నాయకుడే. ఆయన ఎమ్మెల్యే. అలాగే మామ కూడా రాజకీయ నాయకుడే.

ఇప్పుడు ఈమెకు బాంబే హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఆమె క్యాస్ట్‌ సర్టిఫికేట్‌ను రద్దు చేయడంతో పాటు 2 లక్షల రూపాయల జరిమానా విధించింది. నవనీత్ కౌర్‌ది SC మాజిక వర్గం కాదని.. నకిలీ క్యాస్ట్‌ సర్టిఫికేట్‌తో ఆమె పోటీచేసి గెలుపొందారని ఆరోపిస్తూ మాజీ ఎంపీ, శివసేన నేత ఆనందరావు అదసూల్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్‌పై బాంబే హైకోర్టు జూన్ 8న విచారణ చేపట్టింది.

విదర్భ ప్రాంతంలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవనీత్‌ కౌర్‌.. తొలిసారి ఎంపీగా ఎన్నికైంది. బాంబే హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఆమె లోక్‌సభ సభ్యత్వం ప్రమాదంలో పడినట్లైంది. రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయింది నవనీత్ కౌర్.

అయితే తీర్పు ఇంకా బాంబే హైకోర్టు స్థాయిలోనే ఉంది కాబ‌ట్టి, న‌వనీత్ కు ఇంకా అవ‌కాశాలు ఉండ‌వ‌చ్చు. ఆమె సుప్రీం కోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశాలు ఉన్నాయి. అంత‌లోపే ఆమెను ఎంపీగా అన‌ర్హురాలిగా ప్ర‌క‌టిస్తారా అనేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది. ఎస్సీ రిజ‌ర్వ‌డ్ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా నెగ్గింది న‌వ‌నీత్ కౌర్. ఆమె ఎస్సీ కాద‌ని కోర్టు నిర్ధారించ‌డంతో ఈ వివాదం రేగుతోంది.