టాలీవుడ్ లో సినీ ప్రముఖుల బంధాలు , బాంధ్యవ్యాలు..

Advertisement

సినీ పరిశ్రమలో ఎంతో మంది గొప్ప నటీనటులు, దర్శకులు మరియు కళాకారులు అందరు కూడా వాళ్ళ సినిమాలతో ప్రేక్షక దేవుళ్లను ఆదరిస్తుంటారు. ఎన్నో కష్టాలు పడి సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే చాలా వరకు ఒకే కుటుంబానికి లేక బందుత్వానికి చెందిన నటీనటులు,దర్శకులు మరియు కళాకారులు ఎందరో కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. మరి వారు ఎవరో ఒకసారి చూద్దాం.

1)టాలీవుడ్ హీరో రామ్ పోతునేని మరియు శర్వానంద్ ఈ ఇద్దరు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో యువహీరోలగా మంచి పేరు సంపాదిస్తున్నారు. చాలా మందికి తెలీదు వీళ్లిద్దరు కూడా బంధువులు అని. అయితే రామ్ పోతునేనికి శర్వానంద్ బావ వరుస అవుతాడు. రామ్ పోతినేని అక్క గారికి శర్వానంద్ అన్న తో పెళ్లి అయింది. ఇక ఈ యువ నటులు కూడా బంధువులు అయ్యారు.

2) రియల్ స్టార్ శ్రీహరి మరియు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ ఇద్దరు కలిసి చాలా సినిమాలు నటించారు. అయితే వీళ్లిద్దరు కూడా బంధువులే.. ఎలా అంటే ప్రకాష్ రాజ్ మొదటి భార్య శ్రీహరి గారి సొంత చెల్లలు.

3) తన సినిమాలను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి మరియు వందకు పైగా సినిమాలకు సంగీతం అందించిన కీరవాణి ఈ ఇద్దరు కూడా అన్నదమ్ములు అవుతారు. అయితే కీరవాణి గారి పిన్ని కొడుకు ఎస్ ఎస్ రాజమౌళి. అందుకే రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాల్లో చాలా వరకు కీరవాణే సంగీతం అందిస్తారు.

4) టాలీవుడ్ లో హీరో శ్రీకాంత్ మరియు గోపీచంద్ వీళ్లిద్దరి నటనతో గొప్ప పేరును సంపాదించుకున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోలు బంధువులు అని చాలా మందికి తెలీదు.అయితే శ్రీకాంత్ మేనకోడలును గోపీచంద్ పెళ్లి చేసుకున్నాడు.ఇక వీళ్లిద్దరు కూడా బంధువులు అయ్యారు.

5) టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సామాజిక అంశాలతో సినిమాలు తీసి హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. అలాగే దర్శకుడిగా, నటుడిగా తనదైన పేరును సంపాదించుకున్నాడు పోసాని కృష్ణ మురళి. అయితే పోసాని కృష్ణ మురళి కి దర్శకుడు కొరటాల శివ స్వయానా మేనల్లుడు అవుతాడు.

6) టాలీవుడ్ లో కెమరామెన్ గా మంచి పేరు పొందాడు చోట కె నాయుడు. అయితే చోట కె నాయుడుకి యువ హీరో సందీప్ కిషన్ మేనల్లుడు అవుతాడు. అలాగే సందీప్ కిషన్ నటించిన సినిమాలకు చాలావరకు చోట కె నాయుడు కెమెరామన్ గా చేసాడు.

7) విశ్వ నటుడు కమల్ హాసన్ తన నటనతో గొప్ప పేరును సంపాదించున్నాడు. అలాగే నటి సుహాసిని అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అయితే సుహాసిని కి కమల్ హాసన్ స్వయానా బాబాయ్ అవుతాడు. కమల్ అన్నయ్య అయినా చారు హాసన్ కూతురు సుహాసిని. అలాగే సుహాసిని డైరెక్టర్ మణిరత్నంను పెళ్లి చేసుకుంది.

8) నటుడు చంద్రమోహన్ మరియు కళాతపస్వి దర్శకుడు విశ్వనాధ్ ఈ ఇద్దరు కూడా బంధువులే.. వీళ్లిద్దరు కూడా కజిన్స్ అవుతారు.

9) అలనాటి నటి మరియు దర్శకురాలు విజయ నిర్మల, సహజ నటి అయినా జయ సుధకు అత్తా అవుతుంది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన “పండంటి కాపురం” సినిమాలో మొట్ట మొదటి సారి జయసుధ నటించింది.

10) బాలీవుడ్ లో తన సినిమాలతో కుర్రాళ్లలో జోష్ నింపుతుంది నటి విద్యాబాలన్. అలాగే తెలుగులోను మరియు పలు భాషల్లో నటించిన ప్రియమణి కూడా నటి గా మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కజిన్స్ అవుతారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here