Tollywood: ఆనందయ్య మందు వాడాను.. నాకు కరోనా రాలేదు: సీనియ‌ర్ న‌టుడు

Tollywood: గ‌త ఏడాది నుండి ప్ర‌జ‌లు క‌రోనాతో నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. ఫ‌స్ట్ వేవ్‌తో క‌రోనా తొలిగి పోయింద‌ని అంతా అనుకున్నారు. కాని సెకండ్ వేవ్ మొద‌లైంది. దీని వ‌ల‌న చాలా మంది యూత్ చ‌నిపోయారు. క‌రోనా క‌రాళ నృత్యం చేస్తున్న నేప‌థ్యంలో ఏదైన అద్భుతంగా జరిగితే బాగుండు అని అనుకుంటున్న స‌మ‌యంలో ఆనంద‌య్య అనే వ్య‌క్తి చాలా మంది పాలిట దేవునిగా అవ‌త‌రించాడు. ఆయ‌న ఇస్తున్న మందు కరోనాకు విరుగుడు మందుగా వార్త‌ల‌లోకి ఎక్క‌డంతో అంద‌రు ఆనంద‌య్య ఇంటికి ప‌రుగులు తీసారు. కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య అనే ఒక సామాన్యుడు సోషల్ మీడియాలో, మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. ఆయన చుట్టూ ఎన్నో వివాదాలు కూడా చుట్టుముట్టాయి.

ఆనంద‌య్య మందు క‌రోనాకు ప‌ని చేయ‌ద‌ని కొంద‌రు అంటుంటే మ‌రి కొంద‌రు ఆనంద‌య్య ఇస్తున్న ఆయుర్వేదం ఎలాంటి హాని క‌లిగించ‌ద‌ని చెప్పుకొచ్చారు. ఎన్నో నాటకీయ పరిణామాల అనంతరం.. మళ్లీ ఆనందయ్య మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆనంద‌య్య మందును సామాన్యులే కాదు కొంద‌రు సెల‌బ్రిటీలు కూడా విశ్వ‌సిస్తున్నారు. సీనియర్ హీరో జగపతిబాబు.. ‘ఆనందయ్య మందు తాను ఎప్పుడో వేసుకున్నానని.. ఆయుర్వేదం హాని చేయదని తాను బలంగా నమ్ముతానని అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయ‌న ఆయుర్వేద మందుని వాడిన వారిలో నేను ఒక‌డిని. ఆనంద‌య్య మందు వాడాను. నాకు క‌రోనా రాలేదు అని స్ప‌ష్టం చేశారు.

ఆయుర్వేదం ఎలాంటి హాని చేయ‌దు అని నేను విశ్వ‌సిస్తున్నారు. నేచర్, భూదేవి తప్పు చేయదు. ఆనందయ్య మందు విషయంలో చాలామంది అభిప్రాయాలు చూశాను.. రకరకాల వీడియోలు చూసిన తరువాత ఓ అభిప్రాయానికి వచ్చాను. ఎవడేం నమ్మినా సరే.. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్‌లు అయితే ఉండవు.. ఖచ్చితంగా మంచే జరగుతుందని నేను ఆనందయ్య మందుని వాడాను. అదృష్ట‌వ‌శాత్తు ఇప్ప‌టి వ‌ర‌కు కోవిడ్ రాలేదు. చాలా హ్యాపీగా ఉన్నాను అని స్ప‌ష్టం చేశారు జ‌గ‌ప‌తి బాబు. అంత‌క‌ముందు జ‌గ‌ప‌తి బాబు త‌న ట్విట్ట‌ర్‌లో ప్రజల్ని కాపాడటానికి ప్రకృతి ఆనందయ్య మందు రూపంలో మన ముందుకు వచ్చిందని.. ఈ మందు శాస్త్రీయంగా అనుమ‌తులు పొంది ఈ ప్ర‌పంచాన్ని కాపాడుతుంద‌ని ఆశిస్తున్నా.. అతన్ని దేవుడు ఆశీర్వ‌దించాలి’ అని పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.