ప్లాస్మా దానం చేయండి జీవితాలు కాపాడండి : చిరంజీవి
Admin - July 25, 2020 / 10:12 AM IST

ప్రస్తుతం చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. అయితే ఇలా కరోనా బారిన పడిన వారిలో చాలా వరకు కోలుకుంటున్నారు. అయితే కరోనా నుండి కోలుకున్న వారి దగ్గర నుండి ప్లాస్మా సేకరించి కరోనా బారిన పడిన వారికీ ఇస్తే రోగ నిరోధక శక్తి ని పెంపొందించుకోవచ్చు అని డాక్టర్లు చెపుతున్నారు. అయితే కరోనా భారిన పడి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని మెగాస్టార్ పిలుపునిచ్చాడు. అయితే సైబరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్లాస్మా దానం చేసిన సేవియర్స్ కావాలని వీడియో పోస్ట్ చేసిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఆ పోస్ట్‌ను రీ పోస్ట్ చేస్తూ ప్లాస్మా దానంతో కరోనా బాధితుల జీవితాలు కాపాడాలని ఆయన కోరారు.