దేశంలో నిన్న రికార్డ్ స్థాయిలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు

Admin - August 20, 2020 / 06:32 AM IST

దేశంలో నిన్న రికార్డ్ స్థాయిలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నారు. అలాగే హార్డ్ ఇమ్మ్యూనిటికి ఇప్పటిట్లో అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన విషయం కూడా తెలిసిందే. ఇదిలా ఉండగా నిన్న దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 69,652 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో 24గంటల వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో గురువారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 28,36,925కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.

వీరిలో ఇప్పటి వరకు 20లక్షల 96వేల మంది కోలుకోగా మరో 6లక్షల 86వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారిసంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 58వేల మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 74శాతానికి చేరింది. మరణాల రేటు 1.9శాతంగా ఉంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us