అప్పుడు బ‌డుగు జీవి.. ఇప్పుడేమో ల‌క్ష‌ల‌లో ఆదాయం

కొన్నిసార్లు టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా చాలా అవ‌స‌రం. అదృష్టం లేక‌పోతే ఏం త‌ల‌పెట్టినా కూడా స‌క్సెస్ అనేది ప‌ల‌క‌రించ‌దు. తాజాగా ఓ కూలీ చేసిన వినూత్న ప్ర‌య‌త్నం అత‌నికి ల‌క్ష‌ల‌లో సంపాద‌న తెచ్చేలా చేస్తుంది. ఇది చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక్‌కి గుర‌వుతున్నారు. వివ‌రాల‌లోకి వెళితే సంబ‌ల్‌పూర్ జిల్లా వాసి అయిన ముండా కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు కూలి ప‌ని చేసుకుంటూ జీవనం సాగించేవారు.

క‌రోనా త‌ర్వాత అత‌డి ప‌రిస్థితి దారుణంగా మారింది. కూలీ చేసి కుటుంబాన్ని పోషించే అవ‌కాశం లేక‌పోవ‌డంతో అత‌ను చాలా దిగులు చెందాడు. .అకస్మాత్తుగా వచ్చి పడిన లాక్‌డౌన్ అతడి జీవితాన్ని తలకిందులు చేసింది. లాక్‌డౌన్‌లో అతడికి ఎక్కడా పనులు దొరక్కపోవడంతో ప‌రిస్థితి దారుణంగా మారింది. ఓ పూట తింటే మ‌రో పూట తినే ప‌రిస్థితి వారికి లేకుండా పోయింది.

అయితే ముండాకు ఎప్ప‌టి నుండో యూట్యూబ్‌లో వీడియోలు చేసే అల‌వాటు ఉంది. స్నేహితుడి ఫోన్‌లో ఫుడ్ బ్లాగర్లకు సంబంధించిన వీడియోలు తరచూ చూస్తుండేవాడు. ఓ రోజు అత‌నికి యూట్యూబ్ వీడియోలు చేయాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది. ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉన్న‌ప్ప‌టికీ ఎలాగోలా అప్పు తీసుకొని మూడు వేల రూపాయ‌ల‌తో స్మార్ట్ ఫోన్ కొన్నాడు.

ఓ వీడియో షూట్ చేసి తన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడు. రోజు ఇంట్లో ఏం తింటాడు, ఎలా తింటాడు అనేవి వీడియోలో పొందుప‌ర‌చాడు. ఈ వీడియోకి ఊహించని రెస్పాన్స్ రావ‌డంతో అత‌ను వీడియోలు చేయ‌డం కొన‌సాగించారు. తొలి వీడియోకి ఐదు ల‌క్ష‌లు వ్యూస్ రావ‌డంతో, ఏ కంటెంట్ ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారో మూండాకి అర్ధ‌మైంది.

త‌న‌ జీవన విధానానికి సంబంధించిన వీడియోలు అప్‌లోడ్ చేస్తూ ..అందులో రోజు ఏం తింటారు, ఇల్లు ఎక్క‌డ ఉంది, ప‌రిస‌రాలు,గ్రామంలోని ప‌రిస్థితులు, రోజువారి జీవ‌నానికి సంబంధించిన అంశాలతో వీడియోలు చేస్తూ వ‌చ్చాడు ముండా డ‌బ్బుతో పాటు తన గ్రామంలోని సామాజిక పరిస్థితులు, సంప్రదాయాలు, నిత్య జీవితంలో తాము ఎదుర్కొనే కష్టాలపై అందరికీ అవగాహన కల్పించేలా వీడియోలు తీయడమే తన లక్ష్యమని చెబుతున్నాడు ఇసాక్ ముండా.