2జీ సేవలను నిలిపివేయాలి: ముకేశ్ అంబానీ

Admin - August 1, 2020 / 07:27 AM IST

2జీ సేవలను నిలిపివేయాలి: ముకేశ్ అంబానీ

దేశంలో 2జీ సేవలను నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సత్వరమైన చర్యలు తీసుకోవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వ్యాఖ్యానించారు. దేశంలో తొలి మొబైల్ కాల్ ప్రారంభమై 25 సంవత్సరాలు అయిన సంధర్బంగా మాట్లాడిన ముకేశ్…..25 సంవత్సరాల క్రితం ప్రారంభమైన 2జీ సేవలను నిలిపివేయాల్సిన అవసరం ఉందని, దేశంలో ఇంకా 30కోట్ల మంది ఫీచర్ ఫోన్స్ ను వాడుతూ ఇంటర్నెట్ సేవలకు దూరంగా ఉన్నారని తెలిపారు.

ప్రపంచం మొత్తం 5జీ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో 2జీ సేవలను కొనసాగించడంలో అర్ధం లేదని, 2జీ సేవలను చరిత్రలో కలపాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దాదాపు సగం పనులు మొబైల్ ద్వారా జరుగుతున్నాయని, పిల్లలు పాఠాలు కూడా మొబైల్ ద్వారా వింటున్నారని, చదువురాని వాళ్ళు కూడా మొబైల్ ద్వారా వార్తలు వింటున్నా ఇలాంటి తరుణంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి 5జీ సేవల వైపు అడుగులు వేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us