పీసీసీ పగ్గాలు నాకే.. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

Admin - July 22, 2020 / 10:41 AM IST

కాంగ్రెస్ పార్టీలో రాజకీయం రోజురోజుకి రగులుతుంది. అయితే టీపీసీసీ పదవి కోసం ఆ పార్టీలో కీలక నాయకులు అందరు కూడా పోటీ పడుతున్నారు. ఇప్పటికే పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి ఉన్నారని చాలా వరకు టాక్ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి చురుగ్గా పాల్గొంటున్నారు. అధికార పార్టీని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ తన గళం వినిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి.

ఇది ఇలా ఉంటె ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసాడు. టీపీసీసీ పదవి మీకు వస్తుందా అని అడిగారు. దానికి కోమటి రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులూ చాలా మంది ఉన్నారని.. దాంట్లో ముఖ్యంగా జగ్గారెడ్డి,బట్టి విక్రమార్క, వి హనుమంతురావు, శ్రీధర్ బాబు వీళ్లంతా కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉన్నారని అన్నాడు.

వీళ్లందరిలో పీసీసీ పదవి ఎవరికి వచ్చిన నేను సమర్థిస్తామని అన్నాడు. అలాగే నాకు వచ్చిన కూడా నేను పదవి చేపడుతానని.. నేను కాంగ్రెస్ లో ముప్పై నాలుగు సంవత్సరాల నుండి పార్టీలో కీలకంగా పనిచేస్తున్నాని తెలిపాడు కోమటి రెడ్డి. అంతేకాకుండా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా పనిచేశానని చెప్పుకొచ్చాడు.

అలాగే మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నల్గొండ నుండి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుందని అన్నాడు. అలాగే హైకమాండ్ తో అన్ని విషయాలు చర్చించమని.. పీసీసీ పదవి సీనియర్లకు ఎవ్వరికీ ఇచ్చిన సమర్థిస్తామని వివరించాడు.

కానీ పార్టీలోకి నిన్న మొన్న వచ్చిన వాళ్లకు పీసీసీ పదవి ఇస్తే అస్సలు సమర్దించేది లేదని అన్నాడు. మేము అంత పార్టీని నమ్ముకొని ఉన్నామని పార్టీ కోసం ఒక కార్యకర్తగా పనిచేశామని చెప్పుకొచ్చాడు వెంకట్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో కనీసం కొన్ని సీట్లు గెలిపించని వారు రేపు పీసీసీ పదవి చేపట్టి తెలంగాణాలో అధికారం ఎలా తీసుకొస్తారని ప్రశ్నించాడు.

అలాగే సీనియర్లకు ఎవరికి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తామని.. కానీ నిన్న మొన్న వచ్చిన వాళ్లకు ఇస్తే అస్సలు సహించేది లేదని అన్నాడు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని.. టీఆర్ఎస్ పార్టీ సింగల్ డిజిట్ సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేసాడు.

ఇక చూడాలి మరి పీసీసీ పదవి పగ్గాలు చేపట్టి, హస్తానికి అధినేత ఎవరు అవుతారో…

Read Today's Latest Videos in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us