Tirumala : మతి పోగొట్టే విధంగా కలియుగ వైకుంఠం 2022 లెక్కలు
NQ Staff - January 1, 2023 / 09:54 AM IST

Tirumala : కలియుగ వైకుంఠం తిరుమల కి 2022 సంవత్సరంలో భారీ ఆదాయం వచ్చింది. ఈ ఏడాది హుండీ గలగలలాడింది. 2022 సంవత్సరం మొత్తం కలిపి 1320 కోట్ల రూపాయలు హుండీ ద్వారా ఆదాయం వచ్చినట్లుగా టీటీడీ అధికారులు అధికారికంగా వెల్లడించారు.
2022 సంవత్సరంలో తిరుమల శ్రీవారిని 2 కోట్ల 35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. కోటి ఎనిమిది లక్షల మంది శ్రీవారికి తల నీలాలు సమర్పించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం గణనీయంగా పెరుగుతూనే ఉంది.
భక్తుల సంఖ్య పెరగడంతో పాటు హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగింది. గత సంవత్సరం కరోనా కారణంగా భక్తులు కాస్త తగ్గడంతో పాటు హుండీ ఆదాయం తగ్గింది. కానీ ఈ సంవత్సరం మొత్తం కూడా శ్రీవారి ఆలయం భక్తుల కోసం ఓపెన్ చేసి ఉండడం భక్తులతో కిటకిటలాడడం జరిగింది.
కనుక హుండీ ఆదాయం భారీ ఎత్తున వచ్చిందని అధికారులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులు మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు.
వచ్చే ఏడాది హుండీ ఆదాయం 1500 కోట్ల రూపాయలకు పెరిగిన ఆశ్చర్యం లేదని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల సంఖ్య రెండున్నర కోట్లకు మించి అవకాశాలు ఉన్నాయంటున్నారు.