Health Tips : కీళ్ల నొప్పులు, చెడు కొలెస్టరాల్, కంటి సమస్యలకు ఒకటే మెడిసన్..ఈ ఆయిల్‌తో అంతా మటుమాయం..

NQ Staff - September 28, 2023 / 09:05 AM IST

Health Tips : కీళ్ల నొప్పులు, చెడు కొలెస్టరాల్, కంటి సమస్యలకు ఒకటే మెడిసన్..ఈ ఆయిల్‌తో అంతా మటుమాయం..

Health Tips :

టెక్నాలజీ పుణ్యమా అని మానవుడి జీవన ప్రమాణంలో చాలా మార్పులు సంభవించాయి. కష్టపడే తత్వం చాలా మందిలో తగ్గిపోయింది. ఏదైనా తినాలనిపిస్తే ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకుని మరీ ఆరగిస్తున్నారు.కనీసం షాప్స్‌కు వెళ్లేందుకు కూడా జనాలకు ఓపిక ఉండటం లేదు. ఫలితంగా చాలా రోజులకు బయటకెళ్లి నడిస్తే కీళ్ల నొప్పుల సమస్య వేధిస్తుంది. అదేవిధంగా జంక్ ఫుడ్స్ తినడం వలన కొలెస్టరాల్ స్థాయి శరీరంలో పెరిగిపోతుంది. రాత్రంతా నిద్రలేకుండా ల్యాప్‌టాప్ ముందు కూర్చొని వర్క్ చేయడం, మొబైల్ చూస్తూ ఉండటం వలన చిన్న పిల్లల నుంచి పెద్దవారు సైతం కంటి సమస్యలతో బాధపడుతున్నారు.

సరిగా నిద్రపోకపోయినా, ప్రోటీన్ ఫుడ్ తీసుకోకపోయినా శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోయింది. ఇటువంటి సమస్యలతో బాధపడేవారు హాస్పిటల్స్‌‌కు తరచూ క్యూ కడుతుంటారు. మెడిసిన్స్ తరచూ వాడటం వలన కూడా బాడీలో శక్తి తగ్గిపోతుంది. కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తులు ఫిష్ ఆయిల్ వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పైన చెప్పిన సమస్యలన్నీ తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

కొందరు చేపలు తినేందుకు చాలా ఇష్టం చూపిస్తారు. చేపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వలన చెడు కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది. కంటి సమస్యలకు కూడా చేపలు చాలా మేలు చేస్తాయి. చేపల కంటే చేపల నుంచి తీసిన ఫిష్ ఆయిల్ మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చేపల నుంచి తీసిన ఆయిల్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలన్నీ పుష్కలంగా ఉంటాయి. ఫిష్ ఆయిల్ అనేది చేప కణజాలం నుంచి తయారు చేస్తారు. ఫిష్ ఆయిల్ వాడితే గుండె జబ్బులు దూరం అవుతాయి. ఇది శరీరంలో మంచి కొలెస్టరాల్ ను పెంచి చెడు కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది. దీంతో గుండె జబ్బులు దూరం అవుతాయి.

మానసిక ఆరోగ్యానికి మెరుగపర్చడానికి ఫిష్ ఆయిల్ ఎంతో మేలు చేస్తుంది. దీని వలన మెదడు ఆరోగ్యానికి అవసరమయ్యే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్రెయిన్ షార్ప్‌గా పనిచేయడానికి దోహదం చేస్తాయి. ఎవరికైతే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు తక్కువగా ఉంటాయో వారు ఫిష్ ఆయిల్ వాడితే మెదడు చురుకుగా పనిచేస్తుంది.

చేపలతో పాటు చేపల నుంచి తయారైన ఆయిల్ తీసుకుంటే కళ్లకు చాలా మంచిది. వయస్సు మీద పడిన వారికి చూపు తగ్గే అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఫిష్ ఆయిల్ తీసుకుంటే చాలా బెటర్.

గర్భిణీ స్త్రీలకు కూడా చేప నుంచి తీసిన ఆయిల్ ఎంతో ఉపయోగకరమని గైనకాలజిస్టులు చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ టైంలో డిప్రెషన్, ఒత్తిడి వంటి లక్షణాలతో బాధపడేవారికి ఇది నిజంగా మంచి ఔషధం అని చెప్పవచ్చు. క్రమంగా ఆహారంలో తీసుకుంటే తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. మెంటల్లీ గర్భిణీ స్త్రీలు బలంగా కనిపిస్తారు.

Tips To Reduce Joint Pain

Tips To Reduce Joint Pain

రోగనిరోధక వ్యవస్థ బలోపేతానికి ఫిష్ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ప్లూ, జలుబు వంటి సమస్యలు రాకుండా చూస్తాయి. అలాగే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి.

కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఫిష్ ఆయిల్ చాలా మంచి ఔషధం. కూర్చోవడం, నడవడం, పడుకుని లేచేటప్పుడు కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చేప నూనె ప్రయోజనకరంగా ఉంటుంది.కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

Read Today's Latest Health in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us