టిక్ టాక్ మరల తిరిగి రాబోతుందా …?

Advertisement

టిక్ టాక్ భారత్ నిషేధించిన చైనా ఆప్ లలో ఒకటి.. అయితే ఇప్పుడు టిక్ టాక్ ని మరల ఇండియాలో త్వరలోనే తీసుకోవచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే ప్రస్తుతం కేంద్రం బాన్ చేసిన 59 ఆప్ లకు 79 ప్రశ్నలతో కూడిన నోటీసులు పంపడం జరిగింది.

వాటిలో ఆ అప్స్ కి సంబంధించిన మూలాలు, ఫండింగ్, మరియు డేటా మేనేజ్మెంట్ ప్రశ్నలను అడుగుతూ నోటీసులను పంపారు. ఆ ప్రశ్నలను కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖలు ఆయా ఆప్ ల ప్రధాన కార్యాలయాలకు పంపడం చేశారు. అయితే అలా పంపిన ప్రశ్నలకు సరైన సమాధానాలు వచ్చినట్లైతే మరల ఆ అప్ లను తిరిగి వెనిక్కి తీసుకురావచ్చు అని నోటీసుల ద్వారా తెలుస్తుంది. ఇప్పటికే ఆ ప్రశ్నల సమాధానాలు పరీశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ ని కూడా ఏర్పరచడం జరిగింది. ఆయా కమిటీ పరీశిలించిన సమాధానాలు సరైనవి అనిపిస్తే మరల ఆ అప్ లకు తిరిగి అనుమతులు అందించడం లేదా సరైన సమాధానాలు అందనట్లైతే పూర్తిగా బాన్ చేయడం చేస్తారు అన్న విషయాలు నోటీసులలో ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే ఇప్పటికే ఐటీ మంత్రిత్వ శాఖ బాన్ చేసిన 59 ఆప్ లకు ప్రశ్నలతో కూడిన నోటీసులను పంపినట్లు తెలుస్తుంది. దాని తో పాటుగా 3 వారాలలోగా ఆ ప్రశ్నలకు సమాధానాలు తిరిగి పంపాలి అని హెచ్చరించినట్లు కూడా తెలుస్తుంది. ఒక వేల జులై 22 వరకు ఆ ఆప్ ల నుండి సమాధానాలు అందకపోయినట్లైతే కూడా పూర్తి గా బాన్ ప్రకటిస్తారు అంట. దానితో ఇప్పుడు భారత్ కి దూరం అయిన టిక్ టాక్ సంస్థ బైటెండెన్సు కూడా ఆ కంపెనీ పై చైనా వళ్ళ పడిన మరకలను తుడిచే ప్రయత్నాల్లో ఉందంట.

అయితే దానిలో భాగంగానే బైటెండెన్సు ప్రస్తుతం ఉన్న ప్రధాన కార్యాలయం బీజింగ్ నుండి వేరే చోటికి మార్చాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అతి పెద్ద ఆప్ ల యొక్క సంస్థల కార్యాలయాలు ఎక్కువగా లాసేంజిల్స్, న్యూయార్క్, ముంబైలలో ఉన్నాయి. ప్రస్తుతం బిటెండెన్సు సంస్థ కూడా తన కార్యాలయాన్ని బీజింగ్ నుండి వేరే చోటకి మార్చాలన్న నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎక్కడ అన్న దాని పైన ఇంకా పూర్తి స్పష్టత కి రాలేదు. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం మరియు ఐటీ మంత్రిత్వ శాఖ పంపిన ప్రశ్నలకు సరైన సమాధానాలు బైటెండెన్సు సంస్థ తెలిపి వాటి తో కమిటీ సంతృప్తి చెందితే టిక్ టాక్ త్వరలోనే మరల వెనిక్కి వచ్చేస్తుంది అంట. చూడాలి మరి టిక్ టాక్ మరల తిరిగి వస్తుందో లేదో..

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here