యుఎస్ లో కూడా టిక్ టాక్ బ్యాన్

Advertisement

గత కొన్ని రోజులుగా యునైటెడ్ స్టేట్స్ లో వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ ను నిషేధించాలని చర్చ జరుగుతుంది. సెప్టెంబర్ 15 వరకు టిక్ టాక్ ను అమెరికా యొక్క సంస్థలకు అమ్మకపోతే టిక్ టాక్ ను నిషేధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే నిన్న టిక్ టాక్ ను నిషేధించాలని యుఎస్ సెనెట్ సభ్యులందరు ఓటు వేశారు.

అయితే ఈ బిల్లు ఆమోదంకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా సంతకం చేశారు. అయితే ఈ బిల్లును వెంటనే అమలు చేయడం లేదు. మరో 45 రోజుల్లో టిక్ టాక్ ను అమెరికా సంస్థలకు అమ్మకపోతే అప్పుడు బ్యాన్ చేయనున్నారు. అమెరికాలో టిక్ టాక్ తో పాటు వుయ్ చాట్ యాప్ ను కూడా బ్యాన్ చేస్తున్నారు. ఈ రెండు యాప్స్ అమెరికన్స్ యొక్క వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నాయని, అమెరికా రక్షణ నిమిత్తమే వీటిని బ్యాన్ చేస్తున్నామని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతానికి టిక్ టాక్ ను అమెరికా సంస్థలకు అమ్మడం కుదరదని చైనా ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది. ప్రస్తుతానికి బైట్ డాన్స్ కు చెందిన టిక్ టాక్ 5 బిలియన్ డాలర్స్ విలువ చేస్తుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ టిక్ టాక్ బ్యాన్ వ్యవహారం చైనా అమెరికాల మధ్య ఇంకెన్ని వివాదాలకు దారి తీస్తుందో కాలం సమాధానం చెప్తుంది. భద్రతా చర్యల దృశ్య టిక్ టాక్ ను ఇండియాలో నిషేధించిన విషయం తెలిసిందే. చైనాకు చెందిన మరిన్ని యాప్స్ ను ఇండియా త్వరలోనే నిషేదించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here