Mega Millions Jackpot : ఏం అదృష్టం బ్రో నీది.. లాటరీలో రూ.10వేల కోట్లు గెలిచాడు..!
NQ Staff - January 17, 2023 / 10:01 AM IST

Mega Millions Jackpot : అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. అప్పటి వరకు కష్టాల్లో కూరుకుపోయిన వ్యక్తి కూడా.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కూడా అయిపోతుంటాడు. ఇప్పుడు అమెరికాలోని ఓ వ్యక్తికి కూడా ఇలాగే అదృష్టం పట్టుకుంది. ఆయన చేసిన పని ఆయన్ను వేల కోట్లకు అధిపతిని చేసి పడేసింది. అంత డబ్బు వస్తుందని ఆయన కలలో కూడా ఊహించలేదు కాబోలు.
ఇలాంటి అరుదైన ఘటనలు ఎక్కువగా లాటరీ పద్ధతుల్లోనే జరుగుతుంటాయి కదా. ఇప్పుడు ఆయనకు కూడా అందులోనే జాక్ పాట్ తగిలింది. అమెరికాలోని మైన్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి మెగా మిలియన్ జాక్ పాట్ 10,973 కోట్లు గెలుచుకున్నాడు. దాంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
జనవరి 13న..
సాధారణంగా అమెరికాలో ప్రతి నెల 13న శుక్రవారం వస్తే దాన్ని అన్ లక్కీడేగా భావిస్తారు. కానీ అదే రోజున ఈ వ్యక్తి వేల కోట్లు గెలుచుకున్నాడు. జనవరి 13న అమెరికాలో తీసిన మెగా మిలియన్ జాక్ పాట్ డ్రాలో ఆయన కొన్న టికెట్ విన్నర్ అయింది. ఇంకేముంది ఆయన కోటీశ్వరుడయ్యాడు.
కాగా ఇంత మొత్తాన్ని మెగా మిలియన్ జాక్ పాట్ వారు దాదాపు 29 ఏండ్ల పాటు వాయిదాల పద్ధతిలో చెల్లిస్తారు. ఒకవేళ మొత్తం ఒకేసారి కావాలనుకుంటే రూ.7వేల కోట్లు మాత్రమే చెల్లిస్తారు. చాలామంది ఇలా వాయిదాల పద్ధతిలో కాకుండా మొత్తం ఒకేసారి తీసుకుంటారు. ఇప్పుడు అందరూ అతనికి కంగ్రాట్స్ చెబుతున్నారు.
Winner sold at Hometown Gas & Grill in Lebanon Maine. $1.35 Billion! pic.twitter.com/4fazFjn5Bj
— Maine Lottery (@THEMAINELOTTERY) January 14, 2023