మూడు పెళ్లిళ్లు, ఓ కుర్రాడితో ప్రేమాయ‌ణం.. త‌ర్వాత ట్విస్ట్ ఏంటంటే..!

ఓ మ‌హిళ ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా ముగ్గురిని చేసుకుంది. అంత‌టితో ఆగిందా అంటే మూడో భ‌ర్త ఉండ‌గానే ఓ కుర్రాడితో ప్రేమాయ‌ణం న‌డిపింది. ఇది కూతుళ్ల‌కే న‌చ్చ‌క‌పోవ‌డంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. వివ‌రాల‌లోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ మొహల్లా ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వయసున్న మహిళకు ఐదుగురు కూతుళ్లున్నారు.

పెద్ద కుమార్తె వయసు 21 ఏళ్లు. ఆమెకు గతేడాదే పెళ్లయింది. 19 ఏళ్లు, 16 ఏళ్లు, 14 ఏళ్లు, 12 ఏళ్ల వయసున్న మరో నలుగురు కుమార్తెల బాధ్యత ఆమెపై ఉంది. కాని అవ‌న్నీ మ‌ర‌చిన ఆమె ఇంకా ప్రేమ‌, దోమ అంటూ తిరుగుతుండ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. 15 ఏళ్ల వ‌య‌స్సులోనే మొద‌టి సారి పెళ్లి చేసుకున్న ఝాన్సీ మెహ‌ల్లా.. రెండేళ్ల‌లోనే భ‌ర్త‌తో వచ్చిన విభేదాల వ‌ల‌న విడాకులు తీసుకుంది.

కొద్ది రోజుల‌కు వినోద్ అనే వ్య‌క్తిని రెండో పెళ్లి చేసుకుంది. అత‌డు రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డంతో కొద్ది రోజులు ఒంట‌రి జీవితాన్ని గ‌డిపింది. అయితే కొద్ది రోజుల‌కు బ్రిజేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతడితో ఉండగానే 21 ఏళ్ల కుర్రాడు మిథున్‌తో కొన్నాళ్లుగా ప్రేమాయణం నడుపుతోంది. ఈ క్రమంలోనే ఆమె మూడో భర్త అనారోగ్యంతో మరణించాడు. ఇంకేముంది కుర్రాడితో విచ్చ‌ల‌విడిగా వ్య‌వ‌హారం న‌డిపిస్తుండ‌డంతో అంద‌రు నానా ర‌కాలుగా మాట్లాడారు.

ఆమె కూతుళ్లు దీనిని అవ‌మానంగా భావించ‌డంతో ఇటీవ‌లే పెళ్లి చేసుకున్న పెద్ద కూతురు త‌ల్లిని ప్ర‌శ్నించింది. పెళ్లీడుకి వ‌చ్చిన పిల్ల‌ల‌ని పెట్టుకొని ఇదేం ప‌ని, ప‌ద్ద‌తి మార్చుకోమ‌ని సూచించింది. కాని ఆమె కూతురి మాట‌లని ప‌ట్టించుకోకుండా ఇంటి నుండి బ‌య‌ట‌కు గెంటేసింది. మిగిలిన నలుగురు కూతుళ్లు కూడా ఆమెపై ఆగ్రహించడంతో వారిని కూడా ఇంట్లోంచి వెళ్లగొట్టింది. దీంతో ఆ కూతుళ్లంతా శనివారం పోలీసులను ఆశ్రయించారు. వ్యవహారం తెలిసిన పోలీసులు ఆ ప్రేమ జంటను స్టేషన్‌కు పిలిపించారు.

స్టేష‌న్ లో వారు చెప్పిన మాట‌ల‌కు అంతా కంగుతిన్నారు. మేం మేజ‌ర్లం, మాకు న‌చ్చిన‌ట్టు ఉంటాం. కూతుర్ల‌ను హింసిస్తున్న‌నా లేదంటే అన్నం పెట్ట‌కుండా ఉంటున్నానా? అత‌డితో ఉంటే నా కూతుళ్ల‌కు వ‌చ్చిన ఇబ్బంది ఏంటి? అంటూ ఆ మ‌హిళ పోలీస్ స్టేష‌న్‌లోనే గొడ‌వ‌కు దిగింది. అటు ప్రియుడు మిథున్ కూడా మరింత అడ్వాన్స్ అయ్యాడు. ‘మా విషయం గురించి ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదు. పరువు పోతుందని ఇబ్బంది పడనక్కర్లేదు.

మేమిద్ద‌రం త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటున్నాం. ఆమె కూతుళ్లను నా కూతుళ్లుగా చూసుకుంటా. నా సంపాదన అంతా వారికే ఖర్చు చేస్తా. వారి పెళ్లిళ్లు చేస్తా. భవిష్యత్తులో వాళ్లకు అండగా ఉంటా’ అంటూ మిథున్ చెప్పిన మాటలు విని పోలీసులు తలలు పట్టుకున్నారు. అయితే వారిద్ద‌రికి పోలీసులు త‌మ‌దైన శైలిలో కౌన్సిలింగ్ ఇవ్వడంతో మిధున్ ఆమెని క‌ల‌వ‌ను అని చెప్పాడు.మ‌హిళ మాత్రం అత‌నికి దూరంగా ఉండ‌లేను అని చెప్ప‌డం గ‌మ‌న‌ర్హం.