Spain : 2 కోట్లకే 44 ఇళ్ళతో కూడిన ఓ ఊరిని అమ్మేస్తారట.! మీరేమైనా కొంటారా.?

NQ Staff - November 13, 2022 / 09:17 PM IST

Spain : 2 కోట్లకే 44 ఇళ్ళతో కూడిన ఓ ఊరిని అమ్మేస్తారట.! మీరేమైనా కొంటారా.?

Spain : హైద్రాబాద్ శివార్లలో విల్లా కొనాలన్నా కోటిన్నర నుంచి రెండు కోట్లు.. ఆ పైన వెచ్చించాల్సిందే. కానీ, అక్కడ ఏకంగా 44 ఇళ్ళున్నాయ్.. అదో చిన్న గ్రామం.. ఓ చర్చి, ఓ స్కూల్, స్విమ్మింగ్ పూల్.. ఇవన్నీ వున్నాగానీ, ఆ మొత్తం ప్రాంతాన్ని 2.1 కోట్లకే కొనుగోలు చేసెయ్యొచ్చు.!

అయితే, ప్రాంతం మన దేశంలో లేదు. స్పెయిన్‌లో వుందది. వావ్.. స్పెయిన్ అంటే ప్రకృతి అందాలకు నెలవు కదా.! స్పెయిన్‌లోని సాల్టో డే కాస్ట్రో అనే గ్రామం పోర్చుగల్ సరిహద్దులో వుంటుంది. రాజధాని మాడ్రిడ్ నుంచి మూడు గంటల్లో అక్కడికి చేరుకోవచ్చట.

ఓ రిజర్వాయర్ నిర్మాణ నిమిత్తం కార్మికుల కోసం నివాసాలు ఏర్పాటు చేసింది విద్యుత్ ఉత్పత్తి సంస్థ చాలాకాలం క్రితం. ప్రాజెక్టు పూర్తయ్యాక, అక్కడి నుంచి వాళ్ళంతా సమీప పట్టాణాలకు వెళ్ళిపోయారు. దాంతో, ఆ ఊరు మొత్తం ఖాళీ అయ్యింది.

లక్కీ ఛాన్సులే..

2000లో ఓ కుటుంబం ఆ గ్రామన్ని కొనుగోలు చేసినా, ఆర్థిక సమస్యల వల్ల ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న వారి ప్రయత్నం విఫలమయ్యింది. దాంతో ఆ కుటుంబం తిరిగి ఆ ఊరిని విక్రయించేయాలనుకుంది. ప్రస్తుతం ఆ గ్రామాన్ని కొనుగోలు చేసేందుకు దాదాపు మూడొందల మంది ప్రయత్నిస్తున్నారట

రేటు 2.1 కోట్లు అంటే, చాలామందికి అది చాలా చిన్న విషయం. మీకు ఆసక్తి, ఆ శక్తి వుంటే.. ఎంచక్కా ట్రై చేసెయ్యొచ్చు.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us