ధోని కూతురు పసిపాప పై రేప్ చేస్తా అంటూ బెదిరింపులు..

Admin - October 10, 2020 / 07:56 AM IST

ధోని కూతురు పసిపాప పై రేప్ చేస్తా అంటూ బెదిరింపులు..

కొంతమంది ఆకతాయిలు తమ దుర్మార్గపు పనులతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస పరాజయాలతో వెనుకబడుతుంది. అలాగే మొన్న కోల్ కతా, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై ఓటమి చెందింది. ఇక ఈ ఓటమికి గల కారణం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అభిమానులు చెన్నై ఓటమికి రగిలిపోయి ధోని కూతురుపై బెదిరింపులకు పాల్పడడం దారుణంగా మారింది.

ధోని అయిదేళ్ల కూతురుపై అత్యాచారం చేస్తామని కొంతమంది దుర్మార్గులు బెదిరింపులకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. అయితే చెన్నై ఓటమి చెందడంతో.. ధోని దారుణంగా ఫెయిల్ అయ్యాడంటూ ఆయన భార్య సాక్షికి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. అలాగే ధోని కూతురును రేప్ చేస్తామంటూ కొందరు ఆకతాయిలు బెదరించడం సంచలనంగా మారింది. ఇక ఈ బెదిరింపుల పై పలువురు మహిళలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us