రేప్ చేస్తామని కుష్బూ కు బెదిరింపులు
Admin - August 6, 2020 / 10:13 AM IST

సీనియర్ నటి, కాంగ్రెస్ పార్టీ నేత కుష్బూ కు రేప్ చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అయితే ఈ విషయం పై కుష్బూ ఘాటుగా స్పందించింది. తనను రేప్ చేస్తా అని ఓ వ్యక్తి బెదిరిస్తున్నాడని తెలిపింది. అలాగే అతని ఫోన్ నెంబర్, వివరాలు అన్ని కూడా బయట పెట్టి అతనికి గట్టి కౌంటర్ ఇచ్చింది కుష్బూ. అలాగే అతని ట్రూ కాలర్ ద్వారా సంజయ్ వర్మ అనే పేరు వచ్చింది అని ఆమె వెల్లడించింది. కోల్ కత్తా ప్రాంతం నుండి వచ్చిందని తెలిపింది.
కోల్‌కతా పోలీసులు వెంటనే ఈ విషయంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. అంతేకాకుండా ఆ వ్యక్తి వివరాలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేసింది. తనకే ఇలా వేదింపులు వస్తున్నాయి అంటే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటో మీరు ఆలోచించాలని కుష్బూ సీఎం మమతను కోరింది. వెంటనే అతడిని పట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది.