Beggar : యాచ‌కుడి అంతిమ‌యాత్ర‌కు అంత భారీగా జ‌నం రావ‌డానికి కార‌ణం ఏంటి?

Beggar : యాచ‌కుడు చ‌నిపోతే క‌నీసం ఆయ‌న‌ను ద‌గ్గ‌ర‌కు కూడా తీయ‌రు. అలాంటిది ఓ యాచ‌కుడు మ‌ర‌ణిస్తే వేల‌ల్లో జ‌నాలు అంతిమ‌యాత్ర‌లో పాల్గ‌ని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. క‌ర్ణాట‌క‌లో ఓ భిక్షగాడు చనిపోతే ఊరు ఊరంతా ఏడ్చింది.అతని అంతిమ యాత్రకు జనాలు భారీగా తరలివచ్చారు. ఘనంగా నివాళులు అర్పించారు.పైగా ఆ భిక్షగాడు దివ్యాంగుడు కూడా. అతని మరణం జనాలను కదలించివేసింది. కన్నీటి వీడ్కోలు పలికారు. ఏ భిక్షగాళ్లకు దక్కని ఘనమైన అంతిమయాత్ర జరిగింది.

TheNewsQube-

బసవ అలియాస్ హుచ్చా బాస్య అనే యువకుడు ఉన్నాడు. అయితే చుట్టుపక్కల వాళ్ళు బిక్షం పెడితే దానితోనే జీవనం సాగిస్తూ ఉన్నాడు. కానీ యాచకుడు విషయంలో చుట్టుపక్కల వారందరికీ కూడా ఒక అభిప్రాయం ఉంది.. యాచకుడికి బిక్షం పెడితే మంచి జరుగుతుందని స్థానికులు నమ్ముతూ ఉంటారు.

అందుకే చాలామంది ఇతడిని ఇంటికి పిలిచి మరి అన్నం పెట్టేవారు. అయితే ఈ యాచకుడికి ఎన్ని డబ్బులు ఇవ్వాలని అనుకున్నప్పటికీ అతను మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి మాత్రమే తీసుకునే వాడట. ఇక ఇటీవల యాక్సిడెంట్ లో చ‌నిపోగా ,ఈ యాచకుడికి అంతిమయాత్రకు స్థానికులు అందరూ కూడా భారీ మొత్తంలో తరలి రావడం గమనార్హం.

హుచ్చ‌బ‌స్య‌ ప‌ట్ట‌ణంలో ఎన్నో ఏళ్లుగా నివ‌శిస్తున్నాడు. దివ్యాంగుడైన హుచ్చ‌బ‌స్య‌ ప‌ట్ట‌ణంలో ప్ర‌తి ఒక్క‌రికి బాగా తెలిసినవాడే. అంద‌ర్ని ఆప్యాయంగా పలుకరించేవాడు. ఓ భిక్షగాడు అలా పలకరిస్తుంటే మొదట్లో అందరు వింతగా చూసేవారు. తరువాత అలా పలకరిస్తుంటే అతని విషయంలో అందరికి సదభిప్రాయం కలిగింది. అలా ప‌ల‌క‌ల‌రిస్తూ కేవలం రూపాయి మాత్ర‌మే యాచించి తీసుకునేవాడు.

అంత‌కంటే ఎక్కువ ఇచ్చినా తీసుకునేవాడు కాదు. వద్దయ్యా రూపాయే చాలు అనేవాడు.అలా అతని పట్ల క్రమేపీ అభిమానం పెరిగింది.సాధారణంగా బిచ్చగాళ్లు కనిపిస్తే చూసీ చూడనట్లుగా వెళ్లిపోతాం.భిక్ష అడిగినా వినిపించనట్లే వెళ్లిపోతాం. కానీ హుచ్చబస్య కనిపిస్తే ఎవరైనా సరే రూపాయి ఇచ్చే వెళతారు. అలా రూపాయి ఇచ్చినవారిని ఇవ్వని వారిని కూడా ముచ్చబస్య ప్రేమగా పలకరించేవాడు. అలా భిక్షగాడు హచ్చబస్య అందరికి అలవాటు అయిపోయాడు.

అంతమంచి వాడైన హుచ్చబస్యకు రూపాయి ధ‌ర్మం చేయ‌డం వ‌ల‌న మంచి జరుగుతుందనుకునేవారు ప్రజలు. అందుకే హ‌చ్చ‌బ‌స్య క‌నిపిస్తే రూపాయి ఇచ్చేసేవారు స్థానిక ప్ర‌జ‌లు.పగలంతా భిక్షమెత్తుకును హుచ్చబస్య దేవాలయాలు, స్కూళ్లు వంటిచోట తలదాచుకనేవాడు. అక్కడే పడుకునేవాడు. అలా జీవిస్తు పట్టణ ప్రజల అభిమానాన్ని చూరగొన్న హుచ్చబస్య రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతు..చనిపోయాడు.