Snake: ఈ అరిచే జీవి పాము కాదట.. కానీ దీని గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!!

Snake: బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు మన సృష్టిలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతున్నాయి.. జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో కరీంనగర్ లో ఓ వింత జరిగింది. కనీవినీ ఎరుగని రీతిలో ఓ పాము అరుస్తూ కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఈ అరిచే పాముతో కరీంనగర్ ప్రజలు భయపడ్డారు. దీంతో పోలీసులు ఎంక్వయిరీ చేశారు. ఫైనల్ గా తేలిన విషయం ఏంటంటే.. అది ఫేక్ వీడియోగా తేల్చారు. సేమ్ ఇలాంటి ఓ వింత జీవి ఉత్తర అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే ఈ వీడియోలో కనిపించినట్లుగా ఈ జీవి నిజమైన పాము కాదట. కానీ పాములా ఉంటుంది. దీని పేరు ఈస్టర్న్ హాగ్ నోస్ స్నేక్.

ఇది పసుపు, గోధుమ, బూడిద, ఎరుపు, నారింజ రంగుల్లో ఉంటాయి. ఇందులో మగ జీవి దాదాపు 71 సెంటీ మీటర్లు ఉంటుంది. వీటితో పోలిస్తే.. ఆడ జీవులు ఇంకాస్త పొడవుంటాయట. అలాగే వీటికి ముక్కే ప్రధానంగా ఉంటుంది. ఆ ముక్కుతోనే అవి నివాసాన్ని కట్టుకుంటాయి. విషపూరితం కాకపోవడం వల్ల ఇది జనాలకు ఎలాంటి హానీ చేయదు. అలాగే ఇది ఉబయచర జీవి. దీని జీవితకాలం 12 సంవత్సరాలుంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే.. పాములాగా ఈ జీవి కూడా ఎప్పటికప్పుడు తన చర్మాన్ని వదిలేస్తుంది.

ప్రమాదాల నుండి తనను తాను రక్షించుకోవడానికి ఎన్నో జిమ్మిక్కులు చేస్తుంది. అంతేకాదు నాగుపాములా బుసలు కొడుతుంది. వింత వింత శబ్ధాలు చేసి ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాదు ఎదుటివాళ్ళని మాయ చేసేలా శరీరాన్ని వెనక్కి తిప్పి చనిపోయినట్లు యాక్ట్ చేస్తుంది. ఏవైనా జంతువులు అటాక్ చేస్తున్నప్పుడు దుర్వాసనను వెదజల్లే కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. ఈ జీవి 40 గుడ్ల వరకు పెడుతుంది. ఈ జీవుల్ని కెనడా దేశం అంతరించిపోతున్న లిస్ట్ లో చేర్చింది. అలాగే అక్కడి గవర్నమెంట్ వీటిని బంధించినా.. హానీ కలిగించినా నేరం అని తెలిపింది.