Mahesh Babu: సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లొకేష‌న్ షేర్ చేసిన మ‌హేష్ బాబు.. పిక్స్ వైర‌ల్‌

Mahesh Babu టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. నిజానికి ప్రిన్స్ మహేష్ బాబు రేంజ్.. క్రేజ్ స్పెషల్ గానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో మహేష్ బాబు.. సోషల్ మీడియాలో తన మూవీ అప్డేట్స్ దగ్గర్నుండి.. జిమ్, వర్కవుట్స్, టూర్స్ ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటారు. దీంతో మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఎప్పుడు ఎలాంటి పోస్ట్ లు పెడతారా అని ఎదురుచూస్తూనే ఉంటారు అభిమానులు.

లేటెస్ట్ గా సర్కారు వారి పాట సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ ని తన అభిమానులతో పంచుకుంటున్నారు మహేష్. రీసెంట్ గా ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ లేకుండానే 100 మిలియన్ల పోస్టులతో హ్యాష్ ట్యాగ్ సర్కారు వారి పాట సినిమా సోషల్ మీడియాలో రికార్డ్ సృష్టించింది. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే ఇప్పుడు మహేష్ దుబాయ్ లో జరుగుతున్న షూటింగ్ ప్లేస్ ని పోస్ట్ చేశారు.

దాంతో పాటు ప్రముఖ స్టార్టప్ కంపెనీ ఇన్ 5 లో షూట్ జరుగుతుందని.. దుబాయ్ లో సర్కారు వారి పాట షూటింగ్ లో పార్టిసిపేట్ చేయడం ఎంతో అద్భుతంగా ఉందని.. తమ టీమ్ కి ఘన స్వాగతం పలికినవారికి ధన్యవాదాలు అంటూ మహేష్ బాబు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇన్ 5 స్టార్టప్ కంపెనీని ప్రొఫెషనల్స్ కోసం నిర్వహిస్తున్న ఫుల్ సర్వీస్ బిజినెస్ ఇంక్యుబేటర్. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమాలో ముఖ్యమైన సీన్స్ ని తెరకెక్కిస్తున్నట్లు ఫిల్మ్ టీమ్ తెలిపింది. త్వరలోనే దుబాయ్ లో షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకి రానున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

Advertisement