మణిరత్నం మీదే ఆశలు పెట్టుకున్న త్రిష ..ఇదొక్కటే లాస్ట్ ఛాన్స్ ..?
Vedha - November 22, 2020 / 09:30 PM IST

1999 జోడి అన్న సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది త్రిష. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. అయితే నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా మారింది. వరసగా టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి భారీ హిట్స్ అందుకుంది. ఒక దశలో తెలుగులో త్రిష మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వెలిగింది. ఆ తర్వాత కూడ హీరోయిన్ ఇండస్ట్రీకి రావడం అదే సమయంలో త్రిష సినిమాలు ఫ్లాపవడంతో కొంత ఫాం కోల్పోయింది.
కాగా తమిళంలో చేసిన 96 సినిమాతో మళ్ళీ ఫాం లోకి వచ్చింది. ప్రస్తుతం తమిళంలో వరసగా సినిమాలతో పాటు ఒక మలయాళ సినిమా కూడా చేస్తుంది. అయితే ఈ సినిమాలన్నిట్లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘పొన్నియన్ సెల్వన్’ త్రిష కెరీర్ లో మంచి క్రేజీ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఈ సినిమాలో త్రిష ప్రధాన పాత్ర పోషిస్తుంది.
అంతేకాదు భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో విక్రం, అమితాబ్ బచ్చన్, శోభిత ధూళిపాల్ల, ఐశ్వర్య రాయ్, కార్తి, జయం రవి, జయరాం, విక్రం ప్రభు లాంటి భారీ తారాగణం తో కలిసి త్రిష నటించబోతుండటం విశేషం. ఈ సినిమాని మణిరత్నం పాన్ ఇండియన్ రేంజ్ సినిమాగా రూపొందిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. కాగా ఈ సినిమా చోళుల పాలన నేపథ్యంలో కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా మణిరత్నం తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
ఇక ఈ సినిమాలో త్రిష ‘రాణి కుందవై’ పాత్రను పోషిస్తోందట. ఈ పాత్ర కి గుర్రం మీద స్వారీ చేసే సన్నివేశాలు ఉండటంతో దర్శకుడు మణిరత్నం సూచన మేరకు త్రిష గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంది. సినిమాలో త్రిష గుర్రమెక్కి స్వారీ చేసే సీన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉందని…ఈ సినిమా హిట్ అయితే త్రిష కెరీర్ లో భారీ హిట్ అందుకోవడంతో పాటు తన అకౌంట్ లో మంచి సినిమా చేరుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా 2021 ఆఖరున తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.