Cordyceps : బంగారం కంటే ఖరీదు.! భారత్‌పై చైనా ‘ఆక్రమణ’ యత్నానికి అదే కారణమా.?
NQ Staff - December 26, 2022 / 11:26 AM IST

Cordyceps : దాన్ని హిమాలయన్ గోల్డ్ అంటారట. కానీ, అది మెటల్ కాదు. ‘కార్డిసెప్స్’ అని కూడా అంటారు. గొంగలి పురుగు ఫంగస్ అని కూడా పిలుస్తారు. ఇది పుట్టగొడుగు రకానికి చెందిన ఫంగస్. సూపర్ మష్రూమ్స్ అని కూడా వ్యవహరిస్తారు.
దీని ధర జస్ట్ 10 గ్రాములు కేవలం 700 డాలర్లు మాత్రమే. మన కరెన్సీలో అయితే 50 వేలు. సాధారణ.. కాస్త తక్కువ రకం రేటు ఇదు. అదే, నాణ్యమైన కార్డిసెప్స్ అయితే లక్షల్లో ధర పలుకుతుందట.
హిమాలయ ప్రాంతంలో..
భారత్‌లోని హిమాలయ ప్రాంతం.. అందునా చైనా వైపున ఈ కార్డిసెప్స్ ఎక్కువగా దొరుకుతాయి. నిజానికి, చైనాలోనే వీటి ఉత్పత్తి ఎక్కువ. ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనాలోని కింగై ప్రాంతంలో అనూహ్యంగా వీటి సాగు తగ్గడంతో.. డిమాండ్ పెరిగింది.
ఈ కార్డిసెప్స్ని అన్వేషించే క్రమంలోనే భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్ వైపుగా చైనా సైనికులు చొరబడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాలు కావివి ఇండో పసిఫిక్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ నివేదికలోనూ ఇదే విషయం వెల్లడయ్యింది.
ఔషధాల తయారీలో ఈ కార్డిసెప్స్ని ఉపయోగిస్తారు. మరీ ముఖ్యంగా మగవారి పటుత్వం వీటివల్ల పెరుగుతుందని చైనీయులే కాదు, ప్రపంచ దేశాల్లో చాలామంది నమ్ముతారు.