IPL : అసెంబ్లీలో ఐపీఎల్ రచ్చ
NQ Staff - April 11, 2023 / 07:54 PM IST

IPL : తమిళనాడు అసెంబ్లీలో ఐపీఎల్ గురించి చర్చ జరిగింది. గత ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యేలకు మంత్రులకు ఐపీఎల్ టికెట్లను ఇవ్వడం జరిగిందని.. ఈ ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలకు మరియు ప్రజా ప్రతినిధులకు కొన్ని ఐపీఎల్ టికెట్లను ఇవ్వాలంటూ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వం ముందు ఉంచారు.
ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల విజ్ఞప్తిపై మంత్రి ఉదయ నిధి స్టాలిన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఐపీఎల్ ను నిర్వహిస్తున్నది అమిత్ షా తనయుడు జై షా. ఆయన మీకు మిత్రుడు అయిన అమిత్ షా తనయుడు. కనుక మీరు ఎమ్మెల్యేలకు మరియు ప్రజా ప్రతినిధులకు ఐపీఎల్ టికెట్లు అడిగితే ఇస్తారంటూ ఉదయనిధి కౌంటర్ ఇచ్చాడు.
మరో వైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో తమిళనాడుకు చెందిన వారు ఎవరు లేరని పీఎంకే అందోళన నిర్వహించారు. వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టును రద్దు చేయాలని తమిళనాడు ప్రభుత్వంను వారు డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్ లు తమిళనాడు లో జరిగేందుకు ఒప్పుకోం అంటూ వారు ఆందోళన చేపట్టారు. అయితే ప్రభుత్వం మాత్రం పీఎంకే డిమాండ్ ను లైట్ తీసుకున్నట్లుగా ఉంది.