Nagarjuna And Balakrishna : బాలయ్య, నాగార్జున గొడవలకు అసలు కారణం అదే.. ఆయన చేసిన పనితో..?
NQ Staff - January 29, 2023 / 04:15 PM IST

Nagarjuna And Balakrishna : ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి తిరుగులేని స్టార్ డమ్ ఉంది. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర్ రావు ఇండస్ట్రీకి రెండు కండ్ల లాంటి వారు. వారిద్దరి కారణంగానే ఇండస్ట్రీ ఈ రోజు హైదరాబాద్ లో ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి ఎన్టీఆర్, ఏఎన్నార్ అప్పట్లో మంచి స్నేహితులుగా మెలిగారు. కానీ వారిద్దరి కొడుకులు అయిన నాగార్జున, బాలకృష్ణ మాత్రం బద్ద శత్రువులుగా ఉంటున్నారు.
ఇప్పటికీ వీరిద్దరికీ మాటల్లేవు. అంతెందుకు ఏఎన్నార్ చనిపోయినప్పుడు కూడా బాలయ్య చూడటానికి రాలేదు. అయితే వీరిద్దరి మధ్య ఇంత పెద్ద గొడవకు ఓ కారణం ఉన్నట్టు తెలుస్తోంది. అదేంటంటే.. 2012లో ఏఎన్నార్ 55 ఏండ్ల నట ప్రస్థానాన్ని నిర్వహించారు. ఇందుకోసం సుబ్బి రామిరెడ్డి ఓ ప్రోగ్రామ్ ను నిర్వహించారు.
బాలయ్యకు కోపం..
దీని కోసం ఏఎన్నార్ ఓ పత్రికను డిజైన్ చేశారు. అందులో అక్కినేని నాగేశ్వర్ రావు తర్వాత చిరంజీవి, మోహన్ బాబు ఫొటోలను ప్రచురించారు. వారి తర్వాత బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ఫొటోలతో ఆ పత్రికను డిజైన్ చేశారు. ఇక్కడే బాలకృష్ణకు కోపం వచ్చింది. ఎందుకంటే చిరంజీవి తర్వాత తన ఫొటో ఉండాలి గానీ మోహన్ బాబు ఫొటో ఉండటం ఏంటనేది బాలయ్య కోపం.
ఆయన అసహనాన్ని తెలుసుకున్న నాగార్జున బాలయ్య ఇంటికి స్వయంగా వెళ్లాడు. కానీ బాలయ్య ఇంట్లోనే ఉండి తాను లేనని చెప్పి పంపించేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఏఎన్నార్ బాలయ్యకు ఫోన్ చేసి తిట్టాడంట. బాలయ్య కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. దాంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటల్లేవని తెలుస్తోంది. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతోంది.