ప్లాస్మా చికిత్సతో ఎటువంటి ఉపయోగం లేదు; ఢిల్లీ ఎయిమ్స్

Admin - August 7, 2020 / 12:06 PM IST

ప్లాస్మా చికిత్సతో ఎటువంటి ఉపయోగం లేదు; ఢిల్లీ ఎయిమ్స్

కరోనా సోకి కోలుకున్న వ్యక్తుల దగ్గర నుండి ప్లాస్మా సేకరించి కరోనా బాధితులకు అందజేస్తే కరోనాను అరికట్టవచ్చు అని వైద్యులు చెప్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈ ప్లాస్మాతో ఎటువంటి ప్రయోజనం లేదని ఢిల్లీ ఎయిమ్స్ సంచలన విషయాలు వెల్లడించింది. కరోనా బాధితుల పై నిర్వహించిన ప్మాస్మా చికిత్స ఫలితాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయం బయటకు వచ్చిందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. రణదీప్ మాట్లాడుతూ.. కరోనా సోకినా వ్యక్తులను పదిహేను మందితో రెండు బృందాలను ఏర్పాటు చేశామని అన్నాడు.

అయితే మొదటి బృందానికి మాములు చికిత్స అందించామని పేర్కొన్నాడు. అలాగే రెండవ బృందానికి మాములు చికిత్సతో పాటు ప్లాస్మా చికిత్స కూడా అందించారు. అయితే ఈ రెండు విధానాల్లోనూ మరణాల రేటు సమానంగా ఉంది. అయితే దీనిపై మరింత వివరాలు రావాలంటే పరిశోధనలు జరగాల్సి ఉందని తెలిపాడు. ప్మాస్మా థెరపీ వల్ల కరోనా బాధితులకు ఎటువంటి ప్రమాదం లేదని అన్నాడు. అలాగే దీని వల్ల ప్రయోజనాలు కూడా లేవని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించాడు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us