Live Together : సహజీవనం చేస్తే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు.. కన్నడ హైకోర్టు కీలక తీర్పు
NQ Staff - November 14, 2022 / 09:59 AM IST

Live Together : కర్ణాటక కు చెందిన ఒక మహిళ తాను మోసపోయాను అంటూ కోర్టు ను ఆశ్రయించింది. ఒక వ్యక్తి ఎనిమిది సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటానంటూ సహజీవనం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోనంటూ వదిలేశాడని ఆమె ఆరోపిస్తుంది.
తనను మోసం చేసినందుకు గాను ఆయనపై 420 కేసు నమోదు చేయాలంటూ పిటిషన్ వేసింది. ఈ కేసు విచారణ సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన తర్వాత కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు కారణంగా ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందాల కారణంగా సహజీవనం చేశారని అతడు ఉద్దేశ్యపూర్వకంగా మోసం చేయలేదని.. కనుక అతనిపై 420 కేసు పెట్టలేమని కోర్టు తీర్పునిచ్చింది.
సహజీవనం అనేది ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం జరుగుతుంది. దానికి చట్టబద్ధత లేదు. కనుక సహజీవనం చేశాడు కనుక పెళ్లి చేసుకోవాల్సిందే అని తీర్పు ఇవ్వలేమని కీలక వ్యాఖ్యలు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది.
సహజీవనం చేస్తే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అని కర్ణాటక కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సర్వత్ర చర్చ జరుగుతోంది.