Priyamani Comments About Mustafa Raj : ముస్లింను పెళ్లి చేసుకుని తప్పు చేశా.. ప్రియమణి షాకింగ్ కామెంట్లు..!

NQ Staff - June 27, 2023 / 12:14 PM IST

Priyamani Comments About Mustafa Raj : ముస్లింను పెళ్లి చేసుకుని తప్పు చేశా.. ప్రియమణి షాకింగ్ కామెంట్లు..!

Priyamani Comments About Mustafa Raj : ఒకప్పుడు హీరోయిన్ గా ప్రియమణి ఓ ఊపు ఊపేసింది. తెలుగులో అగ్ర హీరోలతో సినిమాలు చేసింది ఈ భామ. చాలా సినిమాల్లో తన నేచురల్ యాక్టింగ్ తో కట్టిపడేసింది. కేవలం తెలుగులోనే కాకుండా అటు తమిళం, కన్నడ భాషల్లో కూడా మెరిసింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆమె ముస్తఫాను ప్రేమించి పెండ్లి చేసుకుంది.

అయితే తన మీద గతంలో వచ్చిన ట్రోల్స్, బాడీ షేమింగ్ మీద తాజాగా స్పందించింది ఈ భామ. నేను గతంలో చాలా అవమానాలు ఎదుర్కున్నాను. ఇప్పటికీ బాడీ షేమింగ్ కామెంట్లు ఎదుర్కుంటున్నాను. ముఖ్యంగా నేను పెండ్లి చేసుకున్నప్పుడు నెగెటివ్ కామెంట్లు ఎక్కువగా విన్నాను.

చాలామంది నీకు ముస్లిం తప్ప ఎవరూ దొరకలేదా అంటూ ట్రోల్స్ చేశారు. అవన్నీ నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నా లైఫ్‌ ను నేను ఎవరితో పంచుకోవాలో నా ఇష్టం. అందుకే నేను నా మీద ఎన్ని కామెంట్లు చేసినా రెస్పాండ్ కాలేదు. కానీ అలాంటి వారి వల్ల నా భర్త ఇబ్బంది పడటం నాకు బాధగా అనిపించింది.

కొన్ని సార్లు ముస్లింను పెండ్లి చేసుకుని తప్పు చేశానేమో.. నా వల్ల ఆయన ఇబ్బంది పడుతున్నాను అని అనిపిస్తుంది. కానీ ఆయన మాత్రం ఇలాంటివి అస్సలు పట్టించుకోరు. నాకు ఏది నచ్చితే అది చేసే ఫ్రీడమ్ ఇచ్చారు. అలాంటి భర్త దొరకడం నా అదృష్టం అంటూ తెలిపింది ప్రియమణి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us