Varasudu Movie : ‘దిల్’ రాజు ‘వారసుడు’పై ఎందుకీ రూమర్లు.?
NQ Staff - January 7, 2023 / 02:29 PM IST

Varasudu Movie : తమిళ హీరో విజయ్‌తో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ‘దిల్’ రాజు తెరకెక్కించిన ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’) సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. జనవరి 11న తమిళంలో ‘వారిసు’, తెలుగులో ‘వారసుడు’ విడుదలవుతాయని ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేశారు.
అయితే, ‘వారిసు’ విషయంలో పెద్దగా అనుమానాలేమీ లేకపోయినా, ‘వారసుడు’ విషయంలో కొంత గందరగోళం వుంది. ‘వారసుడు’ సినిమా సంక్రాంతికి విడుదల కావడం లేదంటూ సోషల్ మీడియాలో బోల్డన్ని గాసిప్స్ కనిపిస్తున్నాయి.
తెలుగు వెర్షన్‌కే ఎందుకు.?
తెలుగు వెర్షన్ విషయంలోనే ఈ గాసిప్స్ వినిపిస్తుండడం గమనార్హం. అయితే, ఈ గాసిప్స్ విషయంలో ఇంతవరకూ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి స్పందనా లేదు. దాంతో, తమిళ వెర్షన్ ‘వారిసు’ కూడా వాయిదా పడిందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
ఈ వాయిదా పుకార్ల నేపథ్యంలో ‘వారిసు’, ‘వారసుడు’పై బజ్ సన్నగిల్లుతోంది. విజయ్ సరసన రష్మిక మండన్న ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. తమన్ సంగీతం అందించగా, ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకుడు.