Heroines : పరిణీతి చోప్రా లాగా పొలిటీషియన్స్ ను పెండ్లి చేసుకున్న హీరోయిన్లు వీరే..!
NQ Staff - May 18, 2023 / 01:53 PM IST

Heroines : మన దేశంలో సినిమా రంగానికి, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. చాలామంది హీరోయిన్లు పొలిటీషియన్లను పెండ్లి చేసుకున్నారు. కొందరు అయితే సీఎంలను కూడా పెండ్లి చేసుకున్నారు. మరి రాజకీయ ప్రముఖులను పెండ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
రాధికా కుమారస్వామి..
ఈ కన్నడ నటి మన తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. మాజీ కర్ణాటక సీఎం కుమార స్వామిని 2006 లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.
స్వరా భాస్కర్..
బాలీవుడ్ భామ స్వరా భాస్కర్ సోషల్ మీడియాలో చాలా పాపులర్. అయితే తాను సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఫహద్ జిరార్ అహ్మద్‌తో పెళ్లి చేసుకున్నట్టు గతంలోనే ప్రకటించింది.
అయేషా టకియా..
తెలుగులో చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసిన అయేషా టాకియా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఆమె 2009లో తన బాయ్‌ఫ్రెండ్, మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు అబూ అసిమ్ అజ్మీ కుమారుడు ఫర్హాన్ అజ్మీని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈయన సమాజ్ వాదీ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు.

There Are Heroines Married Politicians
నవనీత్ కౌర్ రానా..
తెలుగులో చాలా సినిమాల్లో నటించింది నవనీత్ కౌర్. ఆమె ఫిబ్రవరి 3, 2011న మహారాష్ట్రలో స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణాను సామూహిక వివాహం చేసుకుంది. ప్రస్తుతం విదర్భ ప్రాంతంలోని అమరావతి జిల్లాలోని బద్నేరా నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. నవనీత్ కౌర్ కూడా ఎంపీగా పని చేస్తున్నారు.
పరిణీతి చోప్రా..
ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న పరిణీతి చోప్రా కూడా పెండ్లి పీటలు ఎక్కబోతోంది. తన బాయ్ ఫ్రెండ్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ఆమె కొంత కాలంగా డేటింగ్ లో ఉంది. ఇక రీసెంట్ గానే ఇద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. త్వరలోనే పెండ్లి చేసుకోబోతున్నారు.