SUMA: తెల్ల‌వారితే గురువారం చిత్ర బృందంతో సుమ బ‌ర్త్‌డే సెల‌బ్రేషన్స్.. వైర‌ల్ అవుతున్న ఫొటోలు

Priyanka - March 22, 2021 / 03:38 PM IST

SUMA: తెల్ల‌వారితే గురువారం చిత్ర బృందంతో సుమ బ‌ర్త్‌డే సెల‌బ్రేషన్స్.. వైర‌ల్ అవుతున్న ఫొటోలు

SUMA కొన్ని ద‌శాబ్ధాలుగా త‌న యాంక‌రింగ్‌తో అల‌రిస్తున్న టాలెంటెడ్ ప‌ర్స‌న్ సుమ‌. ఎంత ఎదిగిన ఒదిగే ఉండ‌డం ఆమె నైజం. మ‌ల‌యాళీ అయిన‌ప్ప‌టికీ తెలుగుపై ప‌ట్టుబాగా సాధించిన సుమ ఇప్పుడు అద‌ర‌గొడుతుంది. ఆమెని ఇన్సిపిరేష‌న్ తీసుకొని చాలా మంది యాంక‌రింగ్ బాట ప‌ట్టారంటే అతిశ‌యోక్తి కాదు. బుల్లితెర షోస్, ఆడియో వేడుక‌లు, ప్ర‌ముఖుల‌తో ఇంట‌ర్వ్యూలు, కుక‌రీ షోస్ ఇలా ఒక‌టేంటి ఏ ప్రోగ్రామ్ నైన ద‌డ‌ద‌డ‌లాండిచేయ‌డం సుమ నైజం. ఈ రోజు ప్ర‌ముఖ యాంకర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా జ‌రుగుతున్నాయి.

తాజాగా తెల్ల‌వారితే గురువారం టీం సుమ బ‌ర్త్ డేని గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేశారు. ఆమెతో కేక్ క‌ట్ చేయించి విషెస్ తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం సుమ బ‌ర్త్‌డేకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతున్నాయి. గత రాత్రి తెల్ల‌వారితే గురువారం చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌గా, ఈ కార్య‌క్ర‌మాన్ని సుమ హోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. కాగా, తొలి చిత్రం ‘మత్తు వదలరా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు శ్రీ సింహా కోడూరి నటిస్తున్న తాజా చిత్రం ‘తెల్లవారితే గురువారం’. మణికాంత్ జెల్లీ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 27న విడుద‌ల చేయ‌నున్న విష‌యం తెలిసిందే.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us