Srilakshmi Theater : గుంటూరు థియేటర్ లో భారీ చోరీ.. వీరయ్య, వీరసింహారెడ్డి మూడు రోజుల కలెక్షన్లు స్వాహా..!
NQ Staff - January 17, 2023 / 12:53 PM IST

Srilakshmi Theater : పండుగ పూల అందరూ ఎవరి బిజీలో వారు ఉంటే.. దొంగలు మాత్రం వారి చేతి వాటానికి పని చెప్పుతున్నారు. ఇప్పటి వరకు మనం చాలానే దొంగతనాలు చూశాం. బ్యాంకుల్లో, గుడుల్లో, ఆఫీసుల్లో దొంగతనాలు చాలానే జరిగాయి. కానీ ఇప్పుడు ఓ థియేటర్ లో దొంగతనం జరగడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. అవునండి బాబు మీరు విన్నది నిజమే.
శ్రీ లక్ష్మీ థియేటర్ లో..
అదేంటి థియేటర్ లో ఏం ఉంటుంది, అక్కడ ఏం దొంగతనం చేస్తాడు అనుకునేరు. ఈ దొంగ మహా తెలివైన వాడిలా ఉన్నాడు. ఎందుకంటే శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవులు. ఈ రోజుల్లోనే గుంటూరు జిల్లా పొన్నూరులోని శ్రీలక్ష్మీ థియేటర్ లో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ అయ్యాయి. దాంతో మూడు రోజులు కలెక్షన్లు భారీగా వచ్చాయి.
ఎలాగూ బ్యాంకులకు సెలువలే కాబట్టి ఆ మొత్తాన్ని థియేటర్ లాకర్ లోనే దాచి పెట్టారు యజమాని. ఈ విషయాన్ని సదరు దొంగ ఎలా కనిపెట్టాడో ఏమో.. ఆ మొత్తాన్ని కాజేశాడు. దీంతో థియేటర్ యజమాని లబోదిబో మంటున్నాడు. ఈ ఘటనపై కేసు కూడా నమోదయినట్టు తెలుస్తోంది.