Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం లో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పాత్ర..!
NQ Staff - December 3, 2022 / 11:42 PM IST

Delhi Liquor Scam : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి తరుణ్ చుగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణంలో ఏకంగా మూడు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల పాత్ర ఉందని అన్నారు.
పంజాబ్, తెలంగాణ, ఢిల్లీ ముఖ్యమంత్రుల యొక్క పాత్ర ఉందంటూ ఆయన ఆరోపించారు. ఢిల్లీ మద్యం పాలసీ పై లోతైన దర్యాప్తు జరగాలని తాము కోరుకుంటున్నాం అన్నారు. చట్టం ముందు అందరూ సమానం అని.. ఉన్నత కుటుంబంలో పుట్టినంత మాత్రాన వారికి చట్టం అతీతం కాకూడదని తమ భావిస్తున్నామన్నారు.
కుటుంబ పాలనకు తెలంగాణలో చరమగీతం పాడే రోజులు రాబోతున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగితే అవినీతి ఏ స్థాయిలో ఉంటుందో ఢిల్లీ లిక్కర్ స్కాప్ లో జరిగిన అవినీతి నిదర్శనం అన్నట్లుగా ఆయన పేర్కొన్నారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఫోన్ లను ద్వంసం చేశారని తరుణ్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బిజెపి అవుతుందని అధికారంలోకి వచ్చి తెలంగాణలో సుపరిపాలన అందించబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.