Crime News : కషాయంలో విషం.. బ్రేకప్ కి ఒప్పుకోలేదని ప్రియుడ్ని చంపేసింది
NQ Staff - October 31, 2022 / 01:02 PM IST

Crime News : కేరళ లో ఇటీవల జరిగిన యువకుడి హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ప్రియురాలు గ్రీష్మ కషాయంలో పురుగుల మందు కలిపి ఇచ్చి ప్రియుడిని చంపేసిందని పోలీసులు నిర్ధారించారు.
ప్రియురాలు గ్రీష్మ తన నేరంను ఒప్పుకున్నట్లుగా పోలీసులు ప్రెస్ మీట్ ద్వారా పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే అక్టోబర్ 14 వ తారీఖున గ్రీష్మ ఇంటికి ప్రియుడు షారోన్ వెళ్ళాడు. ఆ సమయంలోనే విషం ఇచ్చి చంపేసిందట.
వీరిద్దరు గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే ఇటీవల గ్రీష్మ కి మరో వ్యక్తితో వివాహం నిశ్చయించబడింది. దాంతో షారోన్ తో గ్రీష్మ బ్రేకప్ కి సిద్ధమైంది. కానీ షారోన్ మాత్రం బ్రేకప్ కి ఒప్పుకోలేదు.
ఇద్దరం పెళ్లి చేసుకుందామంటూ ఆమెను ఒత్తిడి చేశాడట. దాంతో అతడిని తప్పించేందుకు కషాయంలో పురుగుల మందు ఇచ్చినట్లుగా స్వయంగా గ్రీష్మ వెల్లడించిందని పోలీసులు పేర్కొన్నారు.
అక్టోబర్ 14 వ తారీఖున తన ఇంటికి వచ్చిన షారోన్ కి కషాయంలో పురుగుల మందు ఇచ్చినట్లుగా గ్రీష్మ అంగీకరించిందని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నట్లుగా వెల్లడించారు.